SGSTV NEWS
Astrology

Digbala Yoga: ఈ రాశుల వారికి రాజ యోగాలు, ధన యోగాలు పట్టబోతున్నాయ్..!



గురు, బుధులు సొంత రాశిలో, శుక్రుడు చతుర్థంలో, శని సప్తమంలో, రవి లేదా కుజుడు దశమంలో సంచారం చేస్తున్నప్పుడు దిగ్బల యోగం అనే రాజయోగం పడుతుంది. ఈ యోగం వల్ల ఏ రంగంలో ఉన్నవారైనప్పటికీ ఊహించని అభివృద్దికి అవకాశం ఉంటుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు అనేక అవకాశాలు, ఆఫర్లు అందుతాయి. నిరుపేద అయినప్పటికీ, మహా భాగ్య యోగం ఏర్పడుతుంది. జీవితంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. శుభ యోగాలకు, శుభ పరిణామాలకు ఎక్కువ అవ కాశముంటుంది. ప్రస్తుతం వృషభం, మిథునం, కన్య, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ దిగ్బల యోగం ఏర్పడింది. ఈ యోగం ప్రభావం ఇప్పటి నుంచి నెల రోజుల వరకు ఉంటుంది.


వృషభం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్రుడి సంచారం ప్రారంభించినందువల్ల ఈ రాశివారికి దిగ్బల యోగం ఏర్పడింది. శుక్రుడు రాశ్యధిపతి కూడా అయినందువల్ల ఈ యోగానికి మరింత బలం కలిగింది. ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అధికార యోగం పడుతుంది. వ్యాపారాల్లో మహా భాగ్య యోగం పడుతుంది. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగు పడుతుంది. సంతాన యోగం కలుగుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.



మిథునం: ఈ రాశిలో గురువు సంచారం వల్ల ఈ రాశివారికి దిగ్బల యోగం కలిగింది. దీనివల్ల రాజ పూజ్యాలు కలుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. తక్కువ శ్రమతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు తప్పకుండా హోదా, ప్రాధాన్యం పెరుగుతాయి. కొత్త ఉద్యోగులకు ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగం మారడానికి ఇది చాలా అనుకూల  సమయం. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్, రాబడి పెరుగుతాయి.


కన్య: ఈ రాశిలో బుధుడు ఉండడం వల్ల, సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ఈ రాశివారికి రెండు విధాలుగా దిగ్బల రాజయోగం కలిగింది. ఫలితంగా ఉద్యోగ జీవితంలో ఒక వెలుగు వెలుగుతారు. ప్రతిభా పాటవాలు, నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఉద్యోగంలోనే కాక సామాజికంగా కూడా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఉన్నతస్థాయి వారితో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.




ధనుస్సు: ఈ రాశికి దశమంలో రవి సంచారం వల్ల దిగ్బల యోగం ఏర్పడింది. ఈ రాశివారికి ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. ఊహించని రాజయోగాలు పడతాయి. రాజపూజ్యాలు పెరుగుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ప్రభుత్వపరంగా గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం ఉంది. అంచనాలకు మించిన రాబడి ఉంటుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది.



మకరం: ఈ రాశికి దశమ స్థానంలో కుజ సంచారం వల్ల దిగ్బల యోగం ఏర్పడింది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి బాగా అనుకూలంగా పరిష్కారం అవుతుంది.

Also read

Related posts