మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో జ్యోతిర్లింగంతో పాటు అనేక ప్రముఖ దేవాలయలునాయి. అందులో ఒకటి కుందేశ్వర మహాదేవ ఆలయం.ఇది ధన త్రయోదశి రోజున భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సుమారు 1100 సంవత్సరాల పురాతనమైన నాలుగు చేతుల కుబేర విగ్రహం ఇక్కడ ప్రతిష్టించబడింది.ధన్ తేరస్ నాడు భక్తులు కుబేరుడి నాభికి నెయ్యి , సుగంధ ద్రవ్యాలను పూసి సంపద , శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు.
సంపద ,శ్రేయస్సుకు అధిపతి అయిన కుబేరుడిని ఆరాధించడానికి అంకితం చేయబడిన గొప్ప పండుగ ధన త్రయోదశి. ఈ రోజున ( అక్టోబర్ 18న) జరుపుకుంటున్నారు. ఈ శుభ సందర్భంగా ఉజ్జయినిలోని కుందేశ్వర్ మహాదేవ్ ఆలయం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహర్షి సాందీపని ఆశ్రమం సమీపంలోని మహాదేవ కాంప్లెక్స్‌లో ఉన్న ఈ ఆలయంలో దాదాపు 1,100 సంవత్సరాల పురాతనమైన కుబేర విగ్రహం ఉంది. దీని చరిత్ర ద్వాపర యుగానికి చెందినదని చెబుతారు.
ఆలయ కథ… శ్రీకృష్ణుడు, బలరాముడు , సుదాముడు మహర్షి సాందీపని వద్ద విద్యను పూర్తి చేసినప్పుడు.. శ్రీ కృష్ణుడు గురు దక్షిణ ఇవ్వడానికి కుబేరుడు స్వయంగా ఇక్కడ కనిపించాడని చెబుతారు. అప్పటి నుంచి కుబేరుడి ఈ నాలుగు చేతుల విగ్రహం ఇక్కడ కూర్చున్న భంగిమలో ప్రతిష్టించబడింది.
అరుదైన విగ్రహం: ఈ విగ్రహం దేశంలోని మూడు ప్రధాన ‘కూర్చున్న’ కుబేర విగ్రహాలలో ఒకటి. ఇది హరి (కృష్ణుడు), హరుడు (శివుడు) కలిసే ప్రదేశంలో ఉంది.
ఆలయ పూజారుల అభిప్రాయం ప్రకారం కుబేరుడిని శాంతింపజేయడానికి ఒక ప్రత్యేకమైన, చాలా ముఖ్యమైన ఆచారం ఉంది. ఈ ఆచారం కింద, లక్షలాది మంది భక్తులు ఈ అద్భుత ఆలయాన్ని సందర్శించి కుబేరుడిని దర్శనం చేసుకుని.. అతని నాభికి నెయ్యి, సుగంధ ద్రవ్యాలను పూస్తారు, తద్వారా అతని కృప కలిగి భక్తుల ఇంట్లో ఖజానా ఎప్పటికీ ఖాళీగా ఉండదని నమ్మకం.
పరిమళ ద్రవ్యాలు, నెయ్యి : కుబేరుడు దేవతల కోశాధికారి. కుబేరుడు యక్షుడు. యక్షులు సువాసనలంటే చాలా ఇష్టం.. కనుక ధన త్రయోదశి రోజున స్వచ్ఛమైన నెయ్యి కలిపిన పరిమళాన్ని అతని నాభికి పూస్తారు.
ఫలితం: కుబేరుడి నాభిపై సువాసనగల నెయ్యిని పూయడం వలన అతను త్వరగా ప్రసన్నుడై.. ఏడాది పొడవునా భక్తుడి ఇంట్లో ఆనందం, శ్రేయస్సు , సంపదను కురిపిస్తాడనే నమ్మకంపై ఈ సంప్రదాయం ఆధారపడి ఉంది.
విగ్రహం లక్షణాలు, పూజలు చతుర్భుజ రూపం: ఈ కుబేర విగ్రహం అత్యంత పురాతన విగ్రహం. చతుర్భుజ రూపంలో కొలువై భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. కుబేరుడు ఒక చేతిలో సోమ పాత్రను పట్టుకుని, మరొక చేతిలో అభయ ముద్రలో భక్తులను ఆశీర్వదిస్తాడు. అతను సంపదకు ప్రతీకగా తన భుజంపై ముంగిస చర్మపు ప్రతిమను మోస్తున్నాడు.
ఇష్టమైన నైవేద్యం: కుబేరునికి పసుపు రంగు చాలా ఇష్టం. కనుక ఈ రోజున పసుపు రంగు స్వీట్లు, పండ్లతో పాటు దానిమ్మను ప్రత్యేకంగా ఆయనకు సమర్పిస్తారు.
ఆచారాలు: ధంతేరస్ కు ఒక రోజు ముందు ఇక్కడ ప్రత్యేక అభిషేకం, హవన , పూజ ఆచారాలు నిర్వహిస్తారు.
శ్రీ యంత్రం: శివాలయాలలో ప్రతిష్టించబడిన రుద్ర యంత్రానికి బదులుగా ఆలయం పైభాగంలో శ్రీ యంత్రం ఉండటం.. సంపద, శ్రేయస్సుకు సంబంధించిన ఈ ప్రదేశం ప్రత్యేకతను చూపుతుంది
