ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రసిద్ధ పండుగ సంక్రాంతి. ఈ పండుగను జనవరి నెలలో జరుపుకుంటారు. కొత్త పంటల రాకను సూచిస్తుంది. భోగి రోజున ప్రజలు భోగి మంటలు వేస్తారు. భోగి పండగ రోజున మంటలు వేయడం వెనుక సాంప్రదాయంతో పాటు శాస్త్రీయ కోణం కూడా దాగిఉంది. ఈ రోజు దక్షిణాయణం చివరి. రోజు అయితే భోగి మంటలు వేసే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. పొరపాటున కూడా కొన్ని పనులు చేయవద్దు.
ప్రతి సంవత్సరం భోగి పండుగను మకర సంక్రాంతికి ఒక రోజు ముందు జరుపుకుంటారు. ఈ ఏడాది జనవరి 13నభోగి పండుగను, జనవరి 14న మకర సంక్రాంతిని జరుపుకోనున్నారు. ఈ ఏడాది భోగి పండగ పుష్య మాసం పౌర్ణమి రోజున వచ్చింది. ఈ రోజు ఉదయం భోగి మంటలు వేసి.. సాయంత్రం పూజ చేయాల్సి ఉంటుంది. సాయంత్రం 05:34 నుంచి రాత్రి 08:12 వరకు పూజలు చేయడానికి శుభ సమయం. ఈ సమయంలో కుటుంబంతో కలిసి సూర్య భగవానుడు, అగ్ని దేవుడి, దుర్గాదేవి, శ్రీ కృష్ణ భగవానుని పూజించవచ్చు.
భోగి పండగ్ రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు
భోగి మంటల్లో చెత్త లేదా ప్లాస్టిక్ వేయవద్దు: అగ్నిని పవిత్రంగా భావిస్తాం. ఇక భోగి రోజున వేసే మంటలను హోమం అంత పవిత్రంగా వేయాలి. కనుక భోగి మంటల్లో చెత్త లేదా ప్లాస్టిక్ వస్తువులు వేయడం అశుభం.
కిరోసిన్ తో మంటలు వెలిగించ వద్దు: భోగి మంటల సమయంలో కర్పూరం, నెయ్యి వేసి మంటలను వెలిగించాలి. అంతేకాని కిరోసిన్ పెట్రోల్ వంటివి వేసి వెలిగించవద్దు.
పాదరక్షలు, చెప్పులు ధరించి భోగి మంటలకు ప్రదక్షణ చేయవద్దు: భోగి మంటల చుట్టూ… అంటే అగ్ని చుట్టూ చెప్పులు లేకుండా తిరగాలి. బూట్లు, చెప్పులు ధరించి ప్రదక్షిణ చేయడం ప్రతికూల శక్తి ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
ఎంగిలి చేసిన ప్రసాదాన్ని అగ్నిలో వేయవద్దు: అగ్నిలో స్వచ్ఛమైన ప్రసాదాన్ని మాత్రమే వేయాలి. ఎంగిలి చేసిన ఆహారాన్ని బోగి మంటల్లో వేయడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయి.
ఎవరినీ అవమానించవద్దు: భోగి రోజున ఎవరినీ అవమానించవద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఇబ్బందులు తలెత్తుతాయి.
ఎవరినీ నొప్పించవద్దు: భోగి రోజున ఎవరినీ నొప్పించకూడదు. ఇలా చేయడం వల్ల దేవతలకు కోపం వస్తుంది.
పిల్లలను మంటల దగ్గర ఒంటరిగా ఉంచవద్దు: భోగి మంటల దగ్గరకు వెళ్ళే పిల్లలను ఎల్లప్పుడూ పెద్దలు పర్యవెక్షిస్తూ ఉండండి. పిల్లలను అగ్ని దగ్గర ఒంటరిగా వదలకూడదు.
భోగి రోజున ఏమి చేయాలంటే..
నువ్వులు, బెల్లం, వేరుశెనగలను అగ్నిలో వేయండి: నువ్వులు, బెల్లం, వేరుశెనగలను భోగి మంటలకు సమర్పించడం వలన ఆనందం, ఐశ్వర్యం కలుగుతాయి.
పేదలకు దానం: భోగి రోజున పేదలకు దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది.
కుటుంబంతో సమయం గడపండి: కుటుంబంతో కలిసి భోగి పండుగను ఆనందంగా జరుపుకోండి.
భోగి ప్రాముఖ్యత
భోగి పండుగ భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన భాగం. ఈ పండుగ ప్రకృతితో మనిషికి అనుబంధాన్ని, వ్యవసాయం ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. భోగి పండుగ ఒకరికొకరు కలిసి ఆనందాన్ని పంచుకోవాలని నేర్పుతుంది. ఈ పండుగ కొత్త పంటల రాకను సూచిస్తుంది. అగ్నిలో తమ దుర్గుణాలను దహించేలా చేయడం వలన దుష్ట శక్తులు నాశనం అవుతాయని నమ్మకం. భోగి పండుగ ఆనందం సంతోషానికి చిహ్నం
Also Read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..