November 21, 2024
SGSTV NEWS
Spiritual

ఇంట్లో వాడిన, ఎండిన తులసి మొక్కను తీసివెయ్యడానికి కూడా నియమాలున్నాయని తెలుసా..

కొంతమంది తులసి మొక్క వాడిపోయినా, ఎండినా సరే పూజిస్తారు. అయితే తులసి పూజకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. కొన్ని పరిమితులు ఉన్నాయి. కనుక తులసి పూజలో తప్పులు చేస్తే ఇబ్బందులు కలుగుతాయి. కనుక తులసి మొక్క వాడిపోతే తులసి మొక్కను ఏమి చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి తెలుసుకుందాం.

ప్రకృతిలోని మనుషులకు మాత్రమే కాదు ప్రతి జీవికి చెట్టుకు కూడా ఎండింగ్ ఉంటుంది. చెట్లు ఎండకు ఎండిపోవచ్చు. లేదా ఇతర కారణాల వలన చచ్చిపోతాయి. అదే విధంగా ఇంట్లో పవిత్రంగా పెంచుకునే తులసి మొక్క జీవిత కాలానికి పరిమితి ఉంది. అలాగే తులసి చెట్టు కూడా కొంత కాలం తర్వాత ఎండిపోతుంది. హిందువుల ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కకు పూజ చేయడం నీరుని సమర్పించడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. దీంతో హిందూ మతంలో జ్యోతిషశాస్త్రంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తుశాస్త్రం ప్రకారం తులసి చెట్టును ఇంట్లో పెంచుకోవడానికి కూడా నియమం ఉంది. ఈ పవిత్ర మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని హిందువులు నమ్ముతారు. కనుక తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీటిని సమర్పించడం వల్ల ఇంట్లో లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. సానుకూల శక్తి వస్తుంది. ఆయుర్వేదంలో కూడా తులసి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది.

హిందూ మతం ప్రకారం తులసి మొక్కకు నీరు సమర్పించి ఉదయం , సాయంత్రం పూజలు నిర్వహిస్తారు. ఈ మొక్కను క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఆర్థిక లాభాలు, శాంతి లభిస్తాయని నమ్మకం. అయితే కొంతమంది తులసి మొక్క వాడిపోయినా, ఎండినా సరే పూజిస్తారు. అయితే తులసి పూజకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. కొన్ని పరిమితులు ఉన్నాయి. కనుక తులసి పూజలో తప్పులు చేస్తే ఇబ్బందులు కలుగుతాయి. కనుక తులసి మొక్క వాడిపోతే తులసి మొక్కను ఏమి చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి తెలుసుకుందాం..

ఈ విషయాలను తప్పని సరిగా గుర్తుంచుకోండి..

నిపుణుల అభిప్రాయం ప్రకారం వాడిన లేదా ఎండిన తులసి మొక్క ఉంటే పూజను చేయకూడదు. ఇంట్లో ఉంచకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే తులసి మొక్క ఎండిపోయినప్పుడు ఇంట్లో ఉంచవద్దు. దాని స్థానంలో కొత్త తులసి మొక్కను పెంచుకోవాలి. ఎండిపోయిన తులసిని ఎప్పుడూ ఇంట్లో ఉంచకూడదు. ఇది ప్రతికూల శక్తిని పెంచుతుంది. తులసి ఎండిపోయిన వెంటనే దానిని తీసివేసి కొత్త మొక్కను నాటుకోవాలి.

అదే సమయంలో ఎండిన తులసి మొక్కను ఎప్పుడూ విసిరి పడెయ్యవద్దు. లేదా మంటలో వేసి కాల్చవద్దు. ఇలా చేయడం చాలా అశుభంగా భావిస్తారు. అయితే ఎండిన తులసి మొక్కను భూమికింద పాతిపెట్టవచ్చు.

వాడిన తులసి ఉంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవసరమైతే తులసి దళాలను పక్కకు పెట్టుకుని మిగిలిన మొక్కను భూమిలో పాతిపెత్తవచ్చు. అయితే ఎప్పుడైనా సరే పొరపాటున కూడా తులసిని రాత్రి సమయంలో ఇంట్లో నుంచి తీసి బయట పడెయ్యవద్దు.

హిందూ మతం ప్రకారం లక్ష్మీదేవి తులసి చెట్టులో నివసిస్తుంది. కనుక తులసి మొక్కను పొరపాటున కూడా పాదాలతో తాకవద్దు. తులసి మొక్క నేలపై పడి ఉంటే దానిని భూమిలో పాతిపెట్టవచ్చు. ఎప్పుడూ చెత్తబుట్టలో వేయకండి. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తులసిని పూజించాలి.

Related posts

Share via