SGSTV NEWS
Spiritual

Navaratri: దుర్గా నవరాత్రుల్లో అమ్మవారికి అస్సలు సమర్పించకూడని పండ్లివే..



దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఉపవాసం, కఠిన దీక్షలు పాటిస్తారు. అయితే, అమ్మవారికి సమర్పించే నైవేద్యంలో కొన్ని పండ్లను పొరపాటున కూడా వాడకూడదని శాస్త్రం చెబుతోంది. నియమానుసారంగా దీక్షను చేయాలనుకునే వారు విధిగా ఈ విషయాలను కూడా పాటించడం మంచిదని పండితులు చెప్తున్నారు. మరి దుర్గాదేవికి సమర్పించకూడని పండ్లు ఏవి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


నవరాత్రులు తొమ్మిది రోజులు దుర్గాదేవి తొమ్మిది వేర్వేరు రూపాలను పూజిస్తారు. ప్రతిరోజు దేవి ఒక ప్రత్యేక రూపాన్ని ఆరాధించి, ఆమెకు ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించడం సంప్రదాయం. ఈ విధంగా చేయడం వల్ల భక్తులకు అమ్మ ఆశీర్వాదం లభిస్తుంది. నవరాత్రి సమయంలో పూజ మాత్రమే కాదు, ఆహారం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. ఈ తొమ్మిది రోజులు ఆహారం పూర్తిగా సాత్వికంగా ఉండాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహారం, మద్యం వాడకం పూర్తిగా నిషేధం. భక్తులు రోజు ఉపవాసం ఉన్న తర్వాత, అమ్మవారికి భోగం సమర్పించినప్పుడే రాత్రి భోజనం చేయాలి.


సమర్పించకూడని పండ్లు
నవరాత్రిలో అమ్మవారికి నైవేద్యం సమర్పించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. పొరపాటున కూడా నిమ్మకాయ, చింతపండు, ఎండు కొబ్బరి, బేరిపండు , అంజీర్ పండ్లను నైవేద్యంగా పెట్టకూడదు. వీటిని శుభప్రదంగా భావించరు. వీటితో పాటు అమ్మవారికి తెచ్చిన పండ్లను ముందుగానే ఇతరులకు ఇవ్వడం అందులోనుంచే తీసి అమ్మకు సమర్పించడం చేయరాదు.  పాడైపోయిన పండ్లను కూడా అమ్మవారికి సమర్పించడం నిషేధం.

అమ్మవారికి సమర్పించదగిన పండ్లు
నవరాత్రి తొమ్మిది రోజులలో దానిమ్మ, మారేడు, మామిడి, సీతాఫలం, సింఘాడా (నీటి కాయ), ఇంకా జట ఉండే కొబ్బరికాయ వంటి పండ్లను అమ్మవారికి సమర్పించడం అత్యంత శుభప్రదం, లాభకరం.  సరైన పండ్లను సమర్పించడం వల్ల అమ్మవారు సంతృప్తి చెందుతారు. భక్తుడి జీవితంలో సుఖం, శాంతి, సమృద్ధి వస్తాయి

Related posts