SGSTV NEWS
Astro TipsSpiritual

Astro Tips for Neem: శని లేదా రాహు-కేతువు దోషాలతో ఇబ్బంది పడుతున్నారా.. ఇంటి ఆవరణలో ఈ మొక్కని పెంచండి..



జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాల్లో శని, రాహు, కేతు గ్రహాలను దుష్ట గ్రహాలని పేర్కొంది. ఈ గ్రహాలను చెడు ప్రభావాలను కలిగించే గ్రహాలని తెలిపింది. ఈ గ్రహాల వలన కలిగే దుష్ప్రభావాలను తగ్గించడంలో వేప చెట్టు సహాయపడుతుందని నమ్మకం. అయితే వేప చెట్టుని ఇంటి ఆవరణలో నాటే సమయంలో వాస్తు నియమాలున్నాయి. వేప చెట్టుని సరైన దిశలో నాటడం ముఖ్యమని గుర్తుంచుకోండి. ఈ చెట్టుని సరైన దిశలో పెంచడం వలన గ్రహ దోషాలు తొలగిపోయి, ఇంటికి శ్రేయస్సు వస్తుంది. జీవితంలో శాంతి నెలకొంటుందని నమ్మకం.

జీవితంలో చాలాసార్లు మనం చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీనికి ఒక కారణం జాతకంలో శనిశ్వరుడు లేదా రాహు-కేతువుల అశుభ ప్రభావం కావచ్చు. ఈ సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని పరిష్కారాలను వాస్తు శాస్త్రంలో పేర్కొన్నాయి. అటువంటి పరిస్థితిలో ఎవరైనా శని లేదా రాహు-కేతువు ల చెడు ప్రభావాలను ఎదుర్కొంటున్నట్లయితే వాస్తు శాస్త్రంలో పేర్కొన్న పరిష్కారం గురించి తెలుసుకుందాం..

హిందూ మతంలో వేప చెట్టు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. వేప చెట్టుకి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు ఆరోగ్య ప్రయోజనాలకు అందిస్తుంది. అయితే ఈ వేప చెట్టుకి జ్యోతిషశాస్త్ర దృక్పథంతో కూడా విశేష ప్రాముఖ్యత ఉంది. శనిశ్వరుడి వలన కలిగే దుష్ప్రభావాలను తగ్గించడంలో వేప చెట్టు సహాయపడుతుందని నమ్ముతారు. అయితే ఈ చెట్టుని సరైన దిశలో పెంచడం ముఖ్యమని గుర్తుంచుకోండి. వేప చెట్టుని సరైన దిశలో పెంచడం వలన గ్రహ దోషాలు తొలగి.. ఇంటికి శ్రేయస్సు వస్తుంది.

వేప చెట్టు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు:
వేప చెట్టు దగ్గర ప్రతికూల శక్తి మనుగడ సాగించదు. ఇది రాహువు, కేతువు, శనిశ్వరుడి ప్రభావాలను తగ్గించడమే కాదు సానుకూలత, సంపదను కూడా తెస్తుంది. ఇంటి బయట వేప చెట్టును నాటడం వల్ల చెడు దృష్టి, పూర్వీకుల శాపం , శని-కుజుడు శాపం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

వేప మొక్కను ఏ దిశలో నాటాలి?
జ్యోతిషశాస్త్రం ప్రకారం వేప కుజుడు, శని , కేతువు గ్రహాలకు సంబంధించినది. అటువంటి పరిస్థితిలో వేప మొక్కను నాటడానికి దక్షిణ దిశ అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ దిశలో ఒక మొక్కను నాటడం ద్వారా పూర్వీకుల ఆశీర్వాదం కలుగుతుంది.

వేప చెట్టు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు
వేప చెట్టు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఉత్తర భారత దేశంలో వేప చెట్టును నీమారి దేవిగా వ్యవహరిస్తారు. కొన్ని శుద్ధి కార్యక్రమాల్లో వేప రెమ్మల ను ఉపయోగిస్తారు. వేప చెక్కతో హవనము చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయని నమ్మకం . వేప ఆకులను కాల్చడం వల్ల ప్రతికూల శక్తులు నశిస్తాయి.

కుజ దోషాన్ని తొలగించే వేప చెట్టు
వేపకు అంగారక గ్రహానికి( కుజుడికి) సంబంధం ఉంది. ప్రతిరోజూ వేప చెట్టుకు నీరు సమర్పించడం ద్వారా కుజ గ్రహ దుష్ప్రభావాలను శాంతింపజేసే హనుమంతుడి ఆశీర్వాదం లభిస్తుంది. వేప మాల ధరించడం ద్వారా శనిశ్వరుడి అశుభ ప్రభావాలను కూడా నివారించవచ్చు. జాతకంలో కేతు దోషం ఉంటే నీటిలో వేప ఆకులు కలిపి స్నానం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది

Related posts

Share this