November 22, 2024
SGSTV NEWS
Spiritual

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై ఘనంగా ఆషాఢమాసం ఉత్సవాలు.. ఆగస్ట్ 4 వరకు అమ్మవారికి సారె సమర్పణ

ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాసం ఉత్సవాలు గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. మేళ తాళాల మధ్య దుర్గమ్మకు ఆషాఢ సారే సమర్పించారు. ఆగష్టు 4వ తేదీ వరకూ అమ్మవారికి ఆషాడం సారెను సమర్పించవచ్చు. వైదిక కమిటీ తరపున దుర్గమ్మకి తొలి సారెను సమర్పించగా .. ఈ నెల 14న అమ్మవారికి తెలంగాణ బంగారు బోనం సమర్పణ చేయనున్నారు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాసం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ వైదిక కమిటీ తరపున దుర్గమ్మకి తొలి ఆషాఢం సారె సమర్పించారు. సారె సమర్పణ కార్యక్రమంలో ఆలయ ఈవో కె.ఎస్.రామారావు, స్థానా చార్యులు శివప్రసాదశర్మ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. కనకదుర్గా నగర్‌లోని గోశాల నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వచ్చి అమ్మవారి సారె సమర్పించారు.

ఇక ఈనెల 14 వ తేదీన అమ్మవారికి తెలంగాణ బంగారు బోనం సమర్పించనున్నారు. జూలై జులై 6నుంచి ఆగష్టు 4వరకూ అమ్మవారికి సారె సమర్పించేందుకు భక్తులకు అవకాశం కల్పించినట్లు ఈవో రామారావు చెప్పారు. జూలై 6 న ప్రారంభమైన ఆషాడమాసం ఆగష్టు 4 న ముగుస్తుంది. ఈ నెల రోజులు కొండపై పండుగ వాతావరణం కనిపిస్తోంది.

Also read :Ratha Yatra 2024: ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర.. 53 ఏళ్ల తర్వాత 2 రోజులు రథయాత్ర.. రేపు అత్త గుడించా ఇంటికి చేరుకోనున్న అన్నా చెల్లెలు

భక్త బృందాల సారె సమర్పణల, వారాహి నవరాత్రులు, శాకంబరీ ఉత్సవాలతో సహా దుర్గమ్మకి కూడా బోనాలు సమర్పిస్తారు. ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివస్తారన్న అంచనా మేరకు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆషాఢ మాసోత్సవాలు, వారాహి నవరాత్రులు, శాకంబరీ ఉత్సవాలతో పాటూ ప్రతి శుక్రవారం, శనివారం భక్తుల రద్దీ మరింత పెరగనుంది.

Also read :Kartik Swami Temple: మేఘాలలో తేలియాడే ఆలయం.. కార్తికేయుడి ఎముకలకు పూజలు..

Related posts

Share via