హిందూ మతంలో అమలక ఏకాదశి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఏకాదశి ఫాల్గుణ మాసంలో వస్తుంది. ఈ రోజున లోక రక్షకుడైన శ్రీ హరి విష్ణువుకు పూజలు చేస్తారు. ఈ రోజున ఉపవాసం ఉంది శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి. అమలక ఏకాదశి రోజున ఉసిరిచెట్టు కింద ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారి ఇల్లు పుణ్యాలకు పుట్టినిల్లుగా మారుతుందనీ, భోగ భాగ్యాలతో తులతూగుతారని జీవితం సంతోషంగా ఉంటుందని నమ్మకం. ఈ రోజున పూజలు, ఉపవాసాలతో పాటు, దానాలు కూడా చేస్తారు.
హిందూ మతంలో ఏకాదశి చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఒక సంవత్సరంలో 24 ఏకాదశిలు వస్తాయి. లోక రక్షకుడైన శ్రీ హరి విష్ణువుకు ఏకాదశి అంకితం చేయబడింది. ప్రతి ఏకాదశికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది. హిందూ క్యాలెండర్ చివరి మాసం అయిన ఫాల్గుణ మాసంలో వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు. అమలక ఏకాదశినే ధాత్రీ ఏకాదశి, అమృత ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు విష్ణువుని పూజించడంతో పాటు ఉసిరి చెట్టుని కూడా పూజిస్తారు. విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు చేసేవారి పాపాలన్నీ నశిస్తాయి. అతని జీవితం ఆనందంతో నిండి పోపుంది. ఆ ఇల్లు ఎప్పుడూ సిరి సంపదతో ధన ధాన్యాలతో నిండి ఉంటుంది. ఈ రోజున విష్ణువును పూజించడం, ఉపవాసం ఉండటంతో పాటు దానధర్మాలు కూడా చేయాలి. ఈ రోజున దానం చేయడం వల్ల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం.
అమలక ఏకాదశి ఉపవాసం ఎప్పుడంటే
హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిధి మార్చి 9న ఉదయం 7:45 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ తిధి మార్చి 10న ఉదయం 7:44 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో అమలక ఏకాదశి ఉపవాసం మార్చి 10న చేయాల్సి ఉంటుంది. మార్చి 11న ఉదయం 6:35 నుంచి 8:13 వరకు ఏకాదశి ఉపవాసం విరమించడానికి సమయం. ఈ సమయంలో ఉపవాసం ముగించవచ్చు.
ఉసిరిని దానం చేయండి
విష్ణువుకు ఉసిరి అంటే చాలా ఇష్టమని నమ్ముతారు. అమలక ఏకాదశి రోజున విష్ణువు ఉసిరి చెట్టులో నివాసం ఉంటాడని నమ్మకం. అందుకనే ఉసిరి చెట్టును పూజించే సంప్రదాయం ఉంది. అయితే ఈ రోజున ఉసిరిని దానం చేయాలి. ఇలా చేయడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అదృష్టం కూడా లభిస్తుంది.
అమలక ఏకాదశి రోజున పేదలకు, అవసరార్థులకు ఆహార వితరణ చేయాలి. ఈ రోజున అన్నదానం చేసేవారికి గోదానం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి.
నల్ల నువ్వులు
అమలక ఎడదాశి రోజున నల్ల నువ్వులను దానం చేయాలి. ఈ దానం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఏకాదశి రోజున నల్ల నువ్వులు దానం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి లభిస్తుంది.
డబ్బు, దుస్తులు
అమలక ఏకాదశి రోజున, పేదలకు డబ్బు, వస్త్రాలను దానం చేయాలి. ఇలా చేయడం వలన ఖచ్చితంగా ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. దీనితో పాటు ఇంట్లోని ప్రతికూల శక్తి కూడా తొలగి పోతుంది.
పసుపు రంగు వస్తువులు
అమలక ఏకాదశి రోజున పసుపు రంగు వస్తువులను దానం చేయాలి. దీని వలన ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి నెలకొంటాయి. అంతేకాకుండా జాతకంలో బృహస్పతి గ్రహం కూడా బలపడుతుంది.
Also read
- శుక్రవారం గుప్త లక్ష్మిని ఇలా పూజించండి.. జీవితంలో ధన, ధాన్యాలకు లోటు ఉండదు..
- Blood Moon on Holi: హోలీ రోజున ఆకాశంలో అద్భుతం.. బ్లడ్ మూన్.. కన్యా రాశిలో ఏర్పడే చంద్ర గ్రహణం
- నేటి జాతకములు…14 మార్చి, 2025
- ఘనంగా ప్రపంచ ల్యాబ్ టెక్నీషియన్ డే వేడుకలు…
- XXX సోప్స్ అధినేత మృతి