SGSTV NEWS
Spiritual

శ్రీశైలంలో రుద్రమూర్తికి విశేష పూజలు



శ్రీశైల మహా క్షేత్రంలో లోకకళ్యాణార్థం రుద్రమూర్తి స్వామికి దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు దంపతులు, ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ముందుగా రుద్రపార్కులోని రుద్రమూర్తి విగ్రహానికి రుద్రమంత్రాలతో పంచామృతాభిషేకం ,గందోదకం, భస్మోదకం, పుష్పోదకం వంటి జలాలతో అభిషేకాలు నిర్వహించారు. రుద్రదేవుని చల్లని చూపులు ఎల్లప్పుడూ కృష్ణానదిపై ఉంచాలన్న సంకల్పంతో ప్రతిఏటా వైశాఖమాసంలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు

Also read

Related posts