రాజధాని ప్రాంతంలో వినూత్నంగా తమ ప్రతిభను చాటుకున్న చలపతి ఇంజనీరింగ్ విద్యార్థులు…
అమరావతి:
గుంటూరు గుంటూరు నగరంలో ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో చలపతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు గుంటూరు మిర్చి ఎంటర్టైన్మెంట్స్ అనే వినోదాత్మక సంస్థ ద్వారా “మజాకా” చిత్రంలోని “బేబీ మా” అనే పాటను రీమేక్ చేశారు. ఆ పాట యొక్క పోస్టర్‌ను ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ ఆవిష్కరించి పాటను రిలీజ్ చేశారు. సందర్భంగా సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ ఈ పాటలో చలపతి విద్యార్థిని విద్యార్థులు నటించారు. ఆ పాట యొక్క చిత్రీకరణ గాని, ఎడిటింగ్ కానీ, నటీనటులు గాని, ప్రొడక్షన్ గాని చలపతి ఇంజనీరింగ్ విద్యార్థులు మాత్రమే చిత్రీకరించి తమ ప్రతిభను నిరూపించుకున్నారనీ. ఈ చిత్రీకరణ దర్శకత్వం,నిర్మాతగా నటుడు నంద్యాల భార్గవ్ (బన్నీ), మరియు కె.సిసింద్రీ, జాహ్నవి, కిట్టు, కొరియోగ్రఫీ యం.మారుతి అఖిల్ తదితరులు నటించారనీ, విద్యార్థులు రాష్ట్ర రాజధానులు ప్రేక్షకులను అలరించేందుకు కోసం ఇటువంటి చిత్రీకరణ ద్వారా వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయాలని, రాజధాని ప్రాంతంలో సినీ ఇండస్ట్రీ ఒకటి ఏర్పడి ధ్వని ద్వారా వృత్తి ఉద్యోగాలు ఆదాయ మార్గాలు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాయని శ్రీధర్ అభిలాషించారు. గతంలో ఇలానే చాలామంది విద్యార్థులు మద్రాసు వెళ్లి తమ ప్రయోగాల ద్వారా సినీ ఇండస్ట్రీలో తెలుగు రాష్ట్రాల్లో తమ ప్రతిభను కనపరుస్తూ ఎంతోమంది దర్శక నిర్మాతలుగా, నటీనటులుగా, రచయితలుగా పేరు తెచ్చుకున్నారని, విభజిత ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లి ఎంతోమంది నటీనటులు నిర్మాతలు దర్శకులు సినీ ఇండస్ట్రీలో సందేశాత్మక చిత్రాలు నిర్మించి పేరు ప్రఖ్యాతలు గడిస్తున్నారని, గుంటూరు మిర్చి ఎంటర్టైన్మెంట్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు గడించాలని శ్రీధర్ విద్యార్థులను అభినందించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నంద్యాల భార్గవ్ (బన్నీ), సిసింద్రీ ,చిలుమూరు ఫణి, సిహెచ్ సుధీర్, మోదుకూరు అఖిల్, ఫణి, వంశి మంజునాథ్, సాయికుమార్ తదితరులు .
Also read
- గుంటూరు మిర్చి ఎంటర్టైన్మెంట్స్ వారు చిత్రీకరించిన పాట విడుదల…
- నేటి జాతకములు…17 అక్టోబర్, 2025
- Lakshmi Kataksham: శుక్ర, బుధుల మధ్య పరివర్తన.. ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం పక్కా..!
- HYD Crime: హైదరాబాద్‌లో దారుణం.. బాత్రూం బల్బ్‌లో సీసీ కెమెరా పెట్టించిన ఓనర్.. అసలేమైందంటే?
- షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య