తండ్రి గెలుపు కోసం తనయుడు ప్రచారం
పెనుగొండ
ఆచంట అసెంబ్లీ ఉమ్మడి కూటమి అభ్యర్థి పితాని సత్యనారాయణ ఎన్నికల గుర్తు సైకిల్ కి ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తనయుడు పితాని భానుచందర్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పెనుగొండలోనిచిట్టూరి వారి వీధి కుమ్మర్ల వీధి వీరంశెట్టి వారి వీధి బ్రాహ్మణ ఏరియా బల్ల వారి వీధి కొమ్మిరెడ్డి వారి వీధి పెచ్చేట్టి వారి వీధి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు నియామకం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువత యువకులను మోసం చేశారని భానుచందర్ విమర్శించారు నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే బాబు వస్తే జాబు వస్తుందని కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన ద్వారా సంపాదన సృష్టించి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం అప్పులు రాష్ట్రంగా మారిందని ప్రతి తల ఒక్క ఇంటికి 10 లక్షలు చొప్పున జగన్మోహన్ రెడ్డి అప్పు తెచ్చారని గుర్తు చేశారు. ఒక్క రూపాయి కూడా సంపద సృష్టించకుండా బటన్ నొక్కుతూ కాలక్షేపం చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని విమర్శించారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉమ్మడి ప్రభుత్వం కేంద్రంలో ఎన్డీఏ నరేంద్ర మోడీ సర్కార్ డబల్ ఇంజిన్ లో సర్కారుతో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. అభివృద్ధి సంక్షేమం సమంగా నడిపే సత్తా చంద్రబాబుకే ఉందని అన్నారు. నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస వర్మ కమలం గుర్తుకు, ఆచంట అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి పితాని సత్యనారాయణ సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని భానుచందర్ ఓటర్లను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నక్క శ్యామల సోని శాస్త్రి టిడిపి పార్టీ ప్రెసిడెంట్ కటిక రెడ్డి నానాజీ, ప్రధాన కార్యదర్శి వేండ్ర రాము, గుర్రాల సూరిబాబు, మండా ప్రసాద్, బండారు నాయుడు, చలుమూరి చంద్రశేఖర్, మద్దెంశెట్టి వెంకటేష్, టిడిపి,జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం