November 21, 2024
SGSTV NEWS
Andhra Pradesh

గంగవరం పోర్టు కార్మికుల పోరాటానికి సంఘీభావం ….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు జిల్లా సహాయ కార్యదర్శి.

2006 వై.యస్. రాజశేఖరరెడ్డి హయాంలో  గంగవరం పోర్టు నిర్మాణం సందర్భంగా నిర్వాసితులైన(ఒకప్పటి విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు) వారి కుటుంబాలవారికి ఉద్యోగాలు కల్ఫిస్తామన్న హామీ ని తుంగలో తొక్కి నేడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రపంచ వ్యాపారవేత్త, కార్పొరేట్ దిగ్గజం అదానీకి గంగవరం పోర్టు కారుచౌకగా ని కట్టబెట్టి  ప్రభుత్వ రంగ విశాఖ పోర్టు ను, విశాఖ ఉక్కు ను సైతం హస్తగతంచేసుకొనే కార్పొరేట్ దిగ్గజం అదానీ తనలక్ష్యం నెరవేర్చుకునేందుకు కేంద్రం లోని మోడీ ప్రభుత్వం తన వంతు సహకారం గా 2 వేలమంది కేంద్ర సాయుధ బలగాలు మోహరించి గంగవరం పోర్టు కార్మికుల పోరాటం అణిచివేతకు తీవ్రంగా ప్రయత్నిస్తోందనీ, ఎన్ని కలు ముగిసిన నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, ప్రశ్నించే పార్టీ గా ఆవిర్భవించామనే, జనసేన లు తమ వ్యూహాత్మక మౌనం వీడి గంగవరం పోర్టు కార్మికుల పోరాటం విజయవంతానికి తమ వంతు సహకారం అందించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
     పై కార్యక్రమంలో ఐ.యఫ్.టి.యు జిల్లా కమిటీ సభ్యులు తీపర్తి వీర్రాజు, ఇఫ్టూ నాయకులు తూరుగోపు వెంకటేశ్వర్లు, తోరం సూరిబాబు, వాసు, తదితరులు పాల్గొన్నారు.

Also read

Related posts

Share via