June 29, 2024
SGSTV NEWS
CrimeTelangana

కొత్తగా పెళ్లైంది.. 2 నెలల్లో అమెరికాకి వెళ్లాల్సింది.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఇంతలోనే..


పెళ్లై నాలుగు నెలలు కూడా కాకముందే. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దారుణమైన నిర్ణయం తీసుకుంది. మరో 2 నెలల్లో అమెరికా వెళ్లాల్సి ఉన్న ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఎవరి జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందే ఎవ్వరూ ఊహించలేరు. అంతేకాకుండా కొందరు అయితే కొన్ని అనుకోని సమస్యల వల్ల జీవితాన్ని అర్ధాంతరంగానే ముగిస్తున్నారు. తాజాగా ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అలాంటి పనే చేసింది. పెళ్లే ఇంకా 4 నెలలు కూడా కాలేదు. మరో రెండు నెలల్లోనే అమెరికా వెళ్లాల్సి ఉంది. మంచిగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం కూడా చేస్తోంది. కానీ ఏం జరిగిందో ఏమో.. ఆమె తెల్లారే సరికి శవమై కనిపిచింది. ఇంట్లోని బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. తన కుమార్తె మరణానికి సంబంధించి ఆ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకుందని చెప్పుకొచ్చారు.


ఈ దుర్ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం నారపునెనిపల్లిలో జరిగింది. దావులూరి వర్షిత(24) హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పని చేస్తోంది. వర్షితకు ఫిబ్రవరి 14న వివాహం జరిగింది. అబ్బాయిది తిరువూరు మండలం ఎరుకుపాడు. పెళ్లైన నాలుగు రోజుల తర్వాత ఆ అబ్బాయి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోయాడు. వర్షితా కూడా మరో రెండు నెలల్లో అమెరికాకు వెళ్లాల్సి ఉంది. వర్షిత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలుసుకుని తండ్రి మే 26న ఇంటికి తీసుకెళ్లాడు. సోమవారం రాత్రి వర్షిత అందరితో కలిసి బాగానే నిద్రపోయింది. కానీ, తెల్లారి లేచి చూసేసరికి వర్షిత కనిపించలేదు. కంగారు పడిన తల్లిదండ్రులు ఇంట్లో వెతిక చూడగా.. ఇంటి పరిసరాల్లోని బావిలో శవమై కనిపించింది. తన కుమార్తె అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడింది అంటూ తండ్రి పోలీసులు ఫిర్యాదు చేశాడు.

వర్షితా ఇంకో రెండు నెలల్లో అమెరికా వెళ్లాళ్సి ఉంది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంది. తన భర్త అమెరికాలో ఉండటం.. తాను ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కావడంతో వీసా కూడా వెంటనే వస్తుందని అనుకున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈ విషయాలను తన భర్తకు, తల్లిదండ్రులకు, అత్తమామలకు వర్షిత తెలియజేసింది. కానీ, ఇంతలోనే ఇలా బలవన్మరణానికి పాల్పడటం ఆ రెండు కుటుంబాలను కలచివేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి అనే కోణంలో, అలాగే ఆత్మహత్యా? కాదా? అనే కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు

Also read

Related posts

Share via