దేశంలో రోజురోజుకు వన్యప్రాణాల మనుగడగు అంతరించిపోతుంది. వ్యాపారం కోసం కొందరు స్మగ్లర్లు హతమార్చి వాటిని హతమార్చుతున్నారు. తాజాగా మరోసారి చిరుతపులి చర్మాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వన్యప్రాణులు, వృక్ష జాతులు భూగోళంపై పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయి అంటారు. మరి అటువంటి వన్యప్రాణుల మనుగడగు మానవ కార్యకలాపాల వల్ల తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. ఈ క్రమంలోనే అడవులను జంతుజలం పూర్తిగా అంతరించిపోతుంది. అయితే ఈ వవ్యప్రాణులను వేటాడకూడదని చట్టాలు చెబుతున్నా.. వేటగాళ్ల ఉచ్చులో ఆ మూగజీవాలు బలవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా.. ఆ వన్యప్రాణల మాంసం, చర్మం ఇతర అవయవాలతో వ్యాపారం చేయడం కోసం వాటిని వేటాడి హతమారుస్తున్నారు. తాజాగా ఓ చిరుతపులి చర్మాన్ని అమ్మేందుకు ప్రయత్నించిన అంతర్రాష్ట్ర స్మగ్లర్లను మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
తాజాగా చిరుతపులి చర్మాన్ని అమ్మేందుకు ప్రయత్నించిన అంతర్రాష్ట్ర స్మగ్లర్లను మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీసులు పట్టుకున్నారు. కాగా, ఆ వివరాలను చెన్నూర్ ఫారెస్టు ఆఫీస్ లో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలియజేశారు. అయితే ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా భూపాలపట్నంలోని బారెగూడ ప్రాంతం నుంచి కొంతమంది స్మగ్లర్లు.. మంచిర్యాలకు చిరుత చర్మం విక్రయించడానికి వస్తున్నారని సమాచారం రావడంతో.. కోటపల్లి ఎస్ఐ సిబ్బందితో రాపన్ పల్లి, సిరోంచ బ్రిడ్జి చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేశారు. ఇక ఆ సమయంలో బైక్పై చిరుత చర్మాన్ని తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, వారిని విచారించగా రెండేండ్ల క్రితం బీజాపూర్ జిల్లా బోడగుట్ట అటవీ ప్రాంతంలో చిరుత పులిని హతమార్చమని, ఆ చర్మాన్నే అమ్మేందుకు తీసుకువస్తున్నామని ఒప్పుకున్నారు. అయితే వారిని అదుపులో తీసుకున్న పోలీసులు పులి చర్మంతో పాటు రెండు బైక్లు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దుర్గం పవన్, బాబర్ ఖాన్పై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎఫ్ఏవో రమేశ్ తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఏసీపీ వెంకటేశ్వర్ అభినందించారు. కోటపల్లి సీఐ సుధాకర్, ఎస్ఐ రవీందర్, కోటపెల్లి ఎఫ్ఆర్ వో రవి పాల్గొన్నారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..