November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

పితాని గెలుపుకు కోడలు నాగసాహితీ ఇంటింటా ప్రచారం

అవ్వ తాతలకు నెలకు 4వేల రూపాయలు పెన్షన్ ఇంటి వద్ద పంపిణీ






పెనుమంట్ర
అవ్వ తాతలకు ప్రతి నెల ఒకటో తేదీన  ఇంటి వద్దకే 4000 రూపాయల పింఛన్ తో పాటు మూడు నెలలు మూడు వేల రూపాయల పింఛన్ మొత్తాన్ని కొత్త ప్రభుత్వం అమలు చేస్తుందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కోడలు నాగ సాహితి అన్నారు. శనివారం పెనుమంట్ర మండలం సోమరాజు ఇల్లెందులపర్రు మల్లిపూడి గ్రామాల్లో టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికల ప్రచారాన్ని ఇంటింటా నిర్వహించారు. ఆచంట అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి పితాని సత్యనారాయణ సైకిల్ గుర్తుకు నరసాపురం పార్లమెంట్ బిజెపి అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస వర్మ కమలం గుర్తుకు ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని నాగ సాహితీ ఓటర్లను అభ్యర్థించారు. సూపర్ సిక్స్ పథకాల ద్వారా మహిళలకు సంక్షేమ పథకాలలో అగ్ర తాంబూలాన్ని అందించారని ఉమ్మడి అభ్యర్థులను గెలిపించి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం ఉచిత బస్ ప్రయాణం ప్రతి నెల మహిళలకు 1400 రూపాయలు అమ్మకు వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి ఒక్కొక్కరికి 15000 రూపాయలు చొప్పున తల్లుల ఖాతాలో జమ చేయడం. నిరుద్యోగ యువతీ యువకులకు నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు. తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి ప్రభుత్వం రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీ పై చంద్రబాబు పెడతారని బాబు వస్తేనే జాబు వస్తుందని నిరుద్యోగ యువతీ యువకులంతా ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని కోరారు. రైతులకు రైతు భరోసా పేరుతో ప్రతి ఏడాదికి 20 వేల రూపాయలు అందించే పథకాన్ని అమలు చేస్తారని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పునరుద్ధరణ చేపడతారని అన్నారు. ప్రతి గ్రామంలోనూ మౌలిక సదుపాయాలు తాగునీటి వసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా పితాని సత్యనారాయణ గారి కృషి చేస్తారని ఈ ఎన్నికల్లో టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి పితాని సత్యనారాయణకు అఖండ విజయాన్ని చేకూర్చాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సానబోయిన సూర్యకాంతం, ఎంపీటీసీ దండు నాగమణి, టిడిపి జిల్లా బిజెపి ఉపాధ్యక్షురాలు మాధవి లత, టిడిపి మహిళలు జనసేన వీర మహిళలు బిజెపి మహిళా మోర్చా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Also read

Related posts

Share via