*రేపు శనివారం గుంటూరు వస్తున్న నటుడు మోహన్ బాబు, మంచు విష్ణులకి నిరసన తెలియజేద్దాం…*
శ్రీకాళహస్తి లో కొలువై ఉన్న శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారికి అపచారం, ఆయన పరమ భక్తుడు కన్నప్పకి ద్రోహం చేస్తూ మంచు విష్ణు తీసిన కన్నప్ప సినిమాని బహిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ ఐక్యవేదిక, ఆంధ్రప్రదేశ్ అర్చక సేవా సంఘం, పురోహిత, హిందూ ధార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి,
*ఈ మేరకు రేపు అనగా 7/06/2025 శనివారం సాయంత్రం3:30 నికి గుంటూరు, బ్రాడిపేట శంకర్ విలాస్ సెంటర్ లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది,* మంచు మోహన్ బాబు కుటుంబం మొదటి నుంచి హిందూ ధర్మంపై, దేవతలపై, బ్రాహ్మణ కులం పై ద్వేషం తో కించపరుస్తూ, అపహాస్యం పాలు చేస్తూ సినిమాలు తీసి పొట్ట గడుపు కుంటున్నారు, గతంలో “దేనికైనా రెడీ” సినిమాలో పురోహితులను, పురోహిత కుటుంబాలను అవహేళన చేస్తూ కించపరుస్తూ సినిమా తీసినప్పుడు మనం నిరసనలు తెలియజేస్తూ చివరకు కోర్టు వరకు వెళ్లి విజయాన్ని సాధించాము , కోర్టు సైతం మంచు మోహన్ బాబు మంచు విష్ణు లకు మొట్టికాయలు వేసింది, అయినా వారి బుద్ధి మార్చుకోకుండా తాజాగా శ్రీకాళహస్తీశ్వరునికి పరమ భక్తుడైన “కన్నప్ప” చరిత్ర తన ఇష్టా రీతిని మార్చి దేవతల వేషాలను ఆధ్యాత్మిక భావాలకు విరుద్ధంగా, కన్నప్ప దంపతుల వేషధారణలను ఆధునికంగా మార్చడమే గాక హాస్యం కోసం బ్రాహ్మణ పాత్రలలో బ్రహ్మానందం, సప్తగిరి లను “పిలక “గిలక” అనే పేర్లు పెట్టి వారి దుర్బుద్ధిని మరొకసారి రుజువు చేసుకున్నారు, దేవతలను బ్రాహ్మణులను కించపరిచే ఈ”నకిలీ కన్నప్ప”సినిమాను బహిష్కరించేందుకు జరుప తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ ఐక్యవేదిక,ఆంధ్రప్రదేశ్ అర్చక సేవా సంఘం మరియు పురోహిత ధార్మిక సంఘాలు పిలుపునిస్తున్నాయి కావున ప్రతి ఒక్కరు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని మన నిరసనను తెలియజేసి నకిలీ కన్నప్ప సినిమాను బహిష్కరిద్దాం….
*గుంటూరు వస్తున్న ఈ కన్నప్ప సినిమా యూనిట్ కు నిరసన తెలియజేద్దాం… దయచేసి సనాతన ధర్మ వాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం..
*జైశ్రీరామ్… హర హర మహాదేవ… జై సనాతన ధర్మం*
Also read
- TG Crime: మహిళ ఎస్సై పై చేయి చేసుకున్న కాంగ్రెస్ నేత
- Watch Video: ఫ్రెండ్ను కలవడానికి వెళ్లి 21వ అంతస్తు నుంచి దూకేసిన లేడీ టెకీ.. మిస్టరీగా మారిన సూసైడ్ కేసు!
- బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ స్టోరీ.. పెనిమిటి హత్యకు శ్రీమతి స్కెచ్
- శివయ్యకి అపచారం…. తిన్నడికి ద్రోహం…”నకిలీ కన్నప్ప సినిమాని బహిష్కరించండి”
- Hyderabad: అలా వచ్చారు.. ఇలా వెళ్లిపోయారు.. మధ్యలో శాల్తీలు లేచాయి