మహా శివరాత్రి పండక్కి ఒక్కరోజు ముందు దారుణం జరిగింది. ఓ ఆలయంలో రాతి శివలింగం చోరీ అయింది. ఈ ఘటన గుజరాత్‌లోని దేవభూమి ద్వారకా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ శివలింగం శతాబ్దాల నాటిదని భక్తులు నమ్ముతున్నారు.
మహా శివరాత్రి పండక్కి ఒక్కరోజు ముందు దారుణం జరిగింది. ఓ ఆలయంలో రాతి శివలింగం చోరీ అయింది. ఈ ఘటన గుజరాత్‌లోని దేవభూమి ద్వారకా జిల్లాలో చోటుచేసుకుంది. ఉదయం ఆలయానికి వచ్చేసరికి ఆలయ తలుపులు తెరిచి ఉన్నాయని.. లోపలికి వెళ్లి చూసేసరికి శివలింగం లేదని ఆలయ పూజారి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పురాతన శివాలయంలోని శివలింగాన్ని పునాదితో సహా పెకిలించి దొంగిలించారని ఆలయ పూజారి ఫిర్యాదులో వెల్లడించారు.
అన్ని వస్తువులు చెక్కుచెదరకుండా
ఆలయంలోని శివలింగం తప్ప మిగిలిని అన్ని వస్తువులు చెక్కుచెదరకుండా ఉన్నాయని తెలిపారు. శివలింగం యొక్క బేస్ ఆలయ సమీపంలోని బీచ్‌లో పడి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి స్థానిక క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ , స్థానిక పోలీసులతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ శివలింగం శతాబ్దాల నాటిదని భక్తులు నమ్ముతున్నారు. మహా శివరాత్రికి ఒక రోజు ముందు పవిత్రమైన శివలింగం దొంగతనం జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు