సోషల్ మీడియా స్నేహాలు ఎంత ప్రమాదకరమైనవో తెలియజేసే మరో ఘటన ఇది. పథకం ప్రకారం ఫేస్బుక్లో పరిచయమైన వివాహిత (36)ను హనీట్రాప్ చేసి తాను పెద్ద వ్యాపారినని నమ్మబలికి, మాయమాటలతో లోబర్చుకుని ఆమె వద్ద రూ. కోటి విలువైన బంగారు వజ్రాభరణాలు తీసుకుని ఉడాయించాడో ఓ వ్యక్తి. పోలీసుల కళ్లుగప్పి నాలుగేళ్లుగా తిరుగుతున్న నిందితుడిని సుమారు ఎట్టకేలకు జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.
జూబ్లీహిల్స్ డీఐ సత్యనారాయణ తెలిపిన మేరకు.. మూసారాంబాగ్‌కు చెందిన సూరజ్శర్మ అలియాస్ నితిన్ డైమా (30) కింగ్ కోఠిలోని ఓ ఆటోమొబైల్ షాపులో పనిచేస్తుంటాడు. 2022లో ఫేస్బుక్లో జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ వివాహిత పరిచయమైంది. దీంతో తరచూ ఇద్దరూ కలుసుకోసాగారు. ఈ క్రమంలో సూరజ్శర్మ.. తాను పెద్ద వ్యాపారినని..అంతేకాక తనకు అతీంద్రియశక్తులు ఉన్నాయని నమ్మించాడు. పలుమార్లు ఆమె వద్ద నుంచి రూ.50 లక్షల నగదు, రూ.10 లక్షల విలువ చేసే వజ్రాభరణాలు, రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను తీసుకున్నాడు. కొద్ది రోజుల దాకా ఆమెతో సన్నిహితంగా ఉండడంతో నామె భర్త, పిల్లలను వదిలి సూరజ్తోనే సహజీవనం చేసింది. అయితే..
పథకం ప్రకారం నిందితుడు ఆమెను వదిలేసి పరారయ్యాడు. పోలీసులకు దొరక్కుండా ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేశాడు. ఫేస్ బుక్ ఖాతాను మూసేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదేళ్లుగా సూరజ్ కదలికలపై నిఘా పెట్టారు. ఐదేళ్లుగా ఫోన్ వాడకుండా ఫేస్‌బుక్‌ను ఉపయోగించకుండా ఉన్న నిందితుడు.. ఇక తనను అందరూ మరిచిపోయారని భావించి పాత ఫోన్ నెంబరును యాక్టివేట్ చేయించాడు. అనంతరం ఫేస్బుక్లో కూడా యాక్టివ్ అయ్యాడు.
రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీసులు.. నిందితుడు మూసారాంబాగ్ లో ఓ ఇంట్లో ఉన్నాడని గుర్తించి గురువారం అరెస్టు చేశారు. ఆరా తీయగా నిందితుడి అసలు పేరు నితిన్ డైమా అని తేలింది. అతనికి వివాహం జరిగినట్లు కూడా గుర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- హెడ్మాస్టర్ మందలించాడని మనస్థాపం.. 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
- ఆమె.. అలా మోసపోయింది
- పుట్టినరోజు పూట విషాదం.. నిద్రిస్తున్న బాలికను బలితీసుకున్న కాలనాగు!
- Guntur Oxford College Scam: గుంటూరు జూనియర్ కాలేజీ చేతివాటం.. విద్యార్ధులకు JEE Main నకిలీ అడ్మిట్ కార్డులు జారీ!
- Crime News : వరంగల్ జిల్లాలో దారుణం…యువతిపై గ్యాంగ్ రేప్..హత్య





