• కారులో తీసుకెళ్లి లైంగిక దాడి
• స్పృహ కోల్పోవడంతో చనిపోయిందని భావించి గుంతలోకి పడేసి ఉడాయింపు
• బాధితురాలి ఫిర్యాదుతో నిందితుల అరెస్ట్
గౌరిబిదనూరు: యోగా టీచర్ హత్యకు సుపారీ తీసుకున్న నిందితులు ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డారు. స్పృహ కోల్పోయినట్లు బాధితురాలు నటించడంతో చనిపోయిందని భావించి గుంతలో పడేసి వెళ్లారు. బాధితురాలు స్థానికుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు. చిక్కబళ్లాపురం పోలీసులు గురువారం వివరాలు వెల్లడించారు. బెంగుళూరులోని కేఆర్ పురకు చెందిన ఓ మహిళ తన భర్తతో విభేదించి విడిగా ఉంటోంది.
యోగా నేర్పుతూ జీవనం సాగిస్తోంది. ఆమెతో సంతోష్ అనే వ్యక్తి సన్నిహితంగా ఉండేవాడు. అయితే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు సంతోష్ భార్య సింధు అనుమానించింది. యోగా టీచర్ను హత్య చేయాలని డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్న సతీశ్రడ్డికి రూ.4 లక్షలకు సుపారీ ఇచ్చింది. సతీశెడ్డి టీచర్తో పరిచయం చేసుకున్నాడు. తాను మాజీ సైనికుడినని, రైఫిల్ షూటింగ్ నేర్పుతానని చెప్పి కారులో తీసుకెళ్లి స్నేహితులతో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు. తొలుత ఒక పర్యాయం లైంగిక దాడికి పాల్పడ్డారు.
మళ్లీ దాడికి యత్నిస్తుండగా ఎలాగైనా వారి నుంచి తప్పించుకోవాలని భావించిన బాధితురాలు తాను యోగాలో నేర్చుకున్న విద్య ద్వారా శ్వాసను బంధించింది. శ్వాస లేకపోవడంతో ఆమె చనిపోయిందని భావించి శిడ్లఘట్ట వద్ద ధనమిట్నహళ్లి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గుంతలో పడేశారు. శరీరంపై చెట్లు వేసి ఉడాయించారు. అర్ధరాత్రి సమయంలో ఆమె నాలుగు కిలోమీటర్లు నడిచి ధనమిట్నహళ్లి చేరుకొని అక్కడి వారి సహయాంతో చిక్కబళ్ళాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలింపు చేపట్టి నిందితులు సతీశ్రడ్డి, నాగేంద్రరెడ్డి, రమణారెడ్డి, రవిచంద్ర, రవితోపాటు సుపారీ ఇచ్చిన సింధును అరెస్ట్ చేశారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025