June 29, 2024
SGSTV NEWS
CrimeNational

మహిళపై లైంగిక దాడి.. పోలీస్‌ కస్డడీలో ప్రైవేట్‌ పార్ట్‌ కోసుకున్న నిందితుడు!

 

 

Rajasthan Crime News: దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా..కామాంధులు ఏమాత్రం మారడం లేదు

 

ఇటీవల దేశంలో మహిళలపై నిత్యం ఎక్కడో అక్కడ లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. మహిళలు ఒంటరిగా బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని పలు మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చిన్న, పెద్ద అనే వయసు తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దిశ, నిర్భయ లాంటి చట్టాలు ఉన్నా మహిళలపై జరుగుతున్న అన్యాయాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. కస్టడీలో ఉన్న ఆ వ్యక్తి బాత్ రూమ్ అని చెప్పి దారుణానికి తెగబడ్డాడు. వివరాల్లోకి వెళితే..

 

రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. లైంగిక కేసులో అరెస్ట్ అయిన ఓ నింధితుడు తన ప్రైవేట్ భాగాలు కోసకొని ఆత్మహత్యా యత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు అతన్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గోపాల్ సింగ్ భాటి స్పందించారు. అబ్దుల్ రషీద్‌ (35)పై ఓ మహిళ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ పోకరన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. ఈ క్రమంలో అతనిపై కేసు నమోదు చేశారు. మరుసటి రోజు అతన్ని కోర్టు‌లో హాజరు పర్చాల్సిన నేపథ్యంలో రాత్రి పోలీస్ స్టేషన్ లో ఉంచారు.

 

  • సోమవారం ఉదయం నిందితున్ని కోర్టులో హాజరు పర్చేందుకు సిద్దమవుతుండగా.. బాత్ రూమ్‌కి వెళ్లాలని చెప్పడంతో పర్మీషన్ ఇచ్చారు పోలీసులు. నిందితుడు బాత్ రూమ్ కి వెళ్లి కొద్దిసేపటికే కేకలు వేయడంతో వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే బ్లేడ్ తో తన ప్రైవేట్ భాగాలు కోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఆపస్మారక స్థితిలో ఉన్న అబ్దుల్ ని వెంటనే పోక్రాన్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బోధ్‌పూర్ హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందించారు. గతంలో అబ్దుల్ పై పలు నేరాలు ఉన్నాయని.. తరుచూ మహిళలను వేధించే వాడని గోపాల్ సింగ్ భాటి తెలిపారు. అబ్దుల్ కి పెళ్లైనా ఇలాంటి పనులు చేస్తున్నాడన్న కారణంతో భార్య విడిచి వెళ్లిపోయింది. అతడు కోలుకునే వరుకు చూసి తదుపరి చర్యలు తీసుకుంటామని గోపాల్ సింగ్ భాటి తెలిపారు.

Related posts

Share via