కొణిజర్ల: ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై డిగ్రీ విద్యార్థితోపాటు ఇద్దరు బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ కాలనీలో 8వ తరగతి చదువుతున్న బాలిక(13) తల్లిదండ్రులు పనిమీద హైదరాబాద్ వెళ్లారు. నాయనమ్మ, తాతయ్య స్థానికంగా ప్రార్ధన చేసేందుకు వెళ్లారు. బాలిక ఇంటి సమీపంలో ఇంటర్ చదువుతున్న బాలుడున్నాడు. ‘మీ తమ్ముడు కిందపడిపోయాడ’ని నమ్మబలికి ఆమెను నిందితుడైన మరో బాలుడి ఇంటికి తీసుకెళ్లాడు. తలుపులు వేసి డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న అరవింద్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత ఇద్దరు బాలురు కూడా బాలికపై అఘాయిత్యం చేశారు. మైనర్లిద్దరూ ఇంటర్ చదువుతున్నారు. బాలిక తల్లి ఫిర్యాదుతో ఎస్సై సూరజ్ నిందితులపై పోక్సో, సామూహిక అత్యాచారం కేసులు నమోదు చేశారు. అరవింద్ ని అదుపులోకి తీసుకోగా బాలురు పరారీలో ఉన్నారు.
Also read
- Garbarakshambigai: మహిళామూర్తులకు సుఖ ప్రసవం చేసేందుకు సాక్షాత్తు జగన్మాత వెలిసిన క్షేత్రం-‘గర్భరక్షాంబిక ఆలయం’, తిరుకరుకావుర్
- నేటి జాతకములు…3 నవంబర్, 2025
- వికారాబాద్లో దారుణం.. వదిన, భార్య, పిల్లలను కొడవలితో నరికి చంపి, ఆపై భర్త సూసైడ్!
- Weekly Horoscope: వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.. 12 రాశుల వారికి వారఫలాలు
- ఎనిమిదో తరగతి బాలికపై లైంగిక దాడి





