April 9, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

చిన్నారిపై లైంగిక దాడి..  బాలుడిపై పోక్సో కేసు



లక్కవరపుకోట (విజయనగరం జిల్లా) : విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలో ఘోరం జరిగింది. ఐదేళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక కుటుంబసభ్యుల కథనం ప్రకారం… రంగరాయపురం పంచాయతీ రెల్లిపేటకు చెందిన ఒక బాలుడు శనివారం రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో అదే పేటకు చెందిన ఒక బాలిక ఇంట్లోకి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించి ఆ బాలికపై లైంగిక దాడి చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులను ఆర్‌డిఒ కీర్తి శనివారం పరామర్శించారు. విజయనగరం డిఎస్‌పి శ్రీనివాసరావు, ఎస్‌.కోట సిఐ ఎల్‌.అప్పలనాయుడు, ఎస్‌ఐ నవీన్‌పడాల్‌ గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. బాలుడిపై పోక్సో, అత్యాచారం కేసు నమోదు చేసినట్లు డిఎస్‌పి తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని జువైనల్‌ కోర్టుకు తరలించినట్లు చెప్పారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఎస్‌.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Also read

Related posts

Share via