విద్యార్థిని పై ఓ టీచర్ లైంగిక దాడి కి పాల్పడ్డ దారుణ ఘటన అనకాపల్లి జిల్లా లో జరిగింది.
అనకాపల్లి జిల్లాలో దారుణం.. విద్యార్ధినిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి విద్యార్థిని పై ఓ టీచర్ లైంగిక దాడి కి పాల్పడ్డ దారుణ ఘటన అనకాపల్లి జిల్లా లో జరిగింది. బాలిక తల్లిదండ్రులు ఆ కీచక టీచర్ కు దేహశుద్ది చేశారు. స్కూల్లో పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ ఉపాద్యాయుడు కీచకుడుగా మరాడు. అదే స్కూల్లో చదువుతున్న ఓ బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. అనకాపల్లి, వడ్డాది ఎన్‌టీఎస్ పాఠశాల లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే స్కూల్లో ఉపాధ్యాయుడుగా ఉన్న ప్రసాద్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ దారుణాన్ని ఆ బాలిక ఇంటికి వెళ్లి, తల్లిదండ్రులతో చెప్పుకున్నది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రు పాఠశాలకు వెళ్లారు. ఆ టీచర్ ను నిలదీయడంతో.. తనకేమి తెలియదని బుకాయించే ప్రయత్నం చేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిని ఈడ్చుకెళ్లి, స్తంబానికి కట్టేసి చితకొట్టారు. పాప తమతో అంతా చెప్పిందని, ఇప్పటికైనా చేసిన నేరం ఒప్పకోవాలని దేహశుద్ది చేశారు. ఈ ఘటనతో స్కూల్లో విద్యార్థినిల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కీచక ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడతామని చెప్పారు.
Also read
- ‘నేను చచ్చిపోయినా బాగుండేది’.. అమీన్పూర్ ముగ్గురు పిల్లల తండ్రి ఆవేదన!
- హెల్త్ సూపర్వైజర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సుపారీ ఇచ్చి మరీ భార్య దారుణంగా!
- Lady Aghori-Sri Varshini: అఘోరీ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. వర్షిణిని రప్పా రప్పా ఈడ్చుకెళ్లిన ఫ్యామిలీ
- ప్రయాణిస్తున్న రైలు వాష్‌రూమ్‌లో వేధింపులు.. వీడియోలు రికార్డింగ్
- ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో