*డెంగ్యూ బాధితునికి సకాలంలో ప్లేట్ లెట్స్ అందజేసిన సంతోష్ రెడ్డి…*
*ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు…*
కామారెడ్డి జిల్లా బ్యూరో ఆగస్టు 17 : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మరావుపేట గ్రామానికి చెందిన సంతోష్ రెడ్డి హైదరాబాదులోని యశోద వైద్యశాలలో డెంగ్యూ వ్యాధితో చికిత్స పొందుతున్న సతీష్ (48) కి అత్యవసరంగా ఓ పాజిటివ్ ప్లేట్ లెట్స్ ను సకాలంలో అందజేసి ప్రాణదాతగా నిలవడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని వారికి సకాలంలో ప్లేట్ లెట్స్ అందజేస్తే వారి ప్రాణాలను కాపాడవచ్చునని అందుకోసం రక్తదాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.43 వ సారి రక్తదానం చేసి ప్రాణదాత గారి నిలిచిన సంతోష్ రెడ్డి కి ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా,రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్న ల తరఫున అభినందనలు తెలియజేశారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025