SGSTV NEWS
CrimeTelangana

Sangareddy: ప్రియురాలు ని బంధువులు కొట్టారని మనస్తాపంతో ప్రియుడి ఆత్మహత్య 

ప్రేమ వ్యవహారంలో యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారని మనస్తాపంతో యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది

సంగారెడ్డి: ప్రేమ వ్యవహారంలో యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారని మనస్తాపంతో యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మాలపహాడ్కు చెందిన రంజిత్ పుల్కల్(20) అనే యువకుడు.. అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆదివారం ఆ యువతి పుట్టిన రోజు సందర్భంగా ఓ ప్రదేశంలో కలుసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి యువకుడిని తీవ్రంగా కొట్టారు. దీన్ని అవమానంగా భావించిన రంజిత్.. సింగూరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుమారుడిని యువతి కుటుంబ సభ్యులే కొట్టి చంపారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also read

Related posts

Share this