విజయవాడ: రూ.5 కోట్లు కట్నం ఇచ్చారు.. అయినా
సరిపోలేదంటూ వివాహం జరిగిన రెండు రోజులకే వేధింపులు మొదలయ్యాయి. వేధింపులు తాళలేని ఆ వధువు విజయవాడ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త, మామపై ఐపీసీ సెక్షన్ 498A, వరకట్న నిషేధ చట్టం సెక్షన్ 3,4 ల కింది కేసు నమోదు చేసిన పోలీసులు.. కోర్టుకు హాజరుపరిచారు. తండ్రీ కొడుకులకు 14 రోజుల రిమాండ్ విధించి.. నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపించారు.
విజయవాడ ఆర్టీసీలో కంట్రోలర్గా పని చేస్తున్న చెరుకూరి లక్ష్మణరావు కుమారుడు హేమంత్ అజయ్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. కర్ణాటక రాయచూర్లోకి చెందిన ప్రసన్నకుమార్ కుమార్తె లక్ష్మి కీర్తనకి అజయ్ పెళ్లి నిశ్చయించారు. పెళ్లికి ముందు నగదు, స్థిరాస్థులు, బంగారం, వెండి మొత్తం కలిపి సుమారు రూ.5 కోట్లు కట్నంగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 7న రాయచూర్ కీర్తన, అజయ్ వివాహం ఘనంగా జరిగింది.
అయితే, వివాహం జరిగిన రెండు రోజులకే లక్ష్మి కీర్తనకి కట్నం వేధింపులు మొదలయ్యాయి. మరో రూ.50 లక్షలు తేవాలంటూ అజయ్, లక్ష్మణరావు వేధింపులకు గురిచేశారు. కట్నం కోసం నవ వధువును తండ్రి, కొడుకులు బంధించడంతో… టార్చర్ భరించలేక.. భవానీపురం పోలీసు స్టేషన్లో నవవధువు ఫిర్యాదు చేసింది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025