SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024CrimeLatest NewsPolitical

రాజీనామా చేస్తే రూ.15వేలు ఆఫర్.. వాలంటీర్లపై  వైకాపా నాయకుల ఒత్తిళ్లు

ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా కొందరు వైకాపా నాయకులు, పాలకుల లక్ష్యం ఒక్కటే. గ్రామ వాలంటీర్లతో రాజీనామా చేయించడమే.

కొత్తపల్లి: ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా కొందరు
వైకాపా నాయకులు, పాలకుల లక్ష్యం ఒక్కటే. గ్రామ వాలంటీర్లతో రాజీనామా చేయించడమే. రహస్యంగా వాలంటీర్లను ఓ ప్రాంతానికి రప్పించుకుని సమావేశాలు నిర్వహించడం, రాజీనామాలకు ఒత్తిడి తీసుకురావడం పరిపాటిగా మారింది. కొందరు విముఖత చూపడంతో వారినీ ఒప్పించేందుకు కొత్త ఆఫర్లను ప్రకటిస్తుండటం కనిపిస్తోంది. బరిలో ఉన్న అభ్యర్థి ద్వారా ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తారని చెబుతుండటం గమనార్హం. అలాగే, మళ్లీ అధికారంలోకి రాగానే మీ ఉద్యోగం తిరిగి ఇస్తామనే హామీలూ గుప్పిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు వాలంటీర్లు ఇష్టం లేకపోయినా రాజీనామాలకు సిద్ధమైనట్లు సమాచారం. సోమవారం కొత్తపల్లి మండలంలోని కొన్ని తీరప్రాంత గ్రామాల్లో ఇదే తరహాలో బేరసారాలు జరిగాయి.

రోజుకు నలుగురిని మార్చాలంట! నాయకులు ఆఫర్కు తోడు.. కొన్ని నిబంధనలనూ ప్రస్తావించడం క్షేత్రస్థాయిలో చర్చగా మారింది. రాజీనామా చేసిన వాలంటీర్లు వైకాపా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించడంతో పాటు.. ఒక్కొక్క వాలంటీర్ రోజుకు కనీసం నలుగురిని కలసి వైకాపాకు ఓటేసేలా చేయాలన్నది ఆ మాటల సారాంశం. ఇలా చేసినందుకు తమ నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుందని భరోసా ఇస్తుండటం భారీగా చర్చగా మారింది.

Also read

Related posts

Share this