అమరావతి : ముచ్చుమర్రి కేసుకు సంబంధించి బాధిత బాలిక కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం అందజేయనున్నట్లు ఎపి హోం మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. సోమవారం ఉదయం అమరావతిలో మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ …. అత్యాచార నిందితులను వదిలే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ముచ్చుమర్రి కేసులో బాధిత బాలిక కుటుంబానికి రూ.10లక్షలు పరిహారం అందజేస్తామని, మరోచోట అత్యాచారానికి గురైన బాలిక పేరుతో రూ.5 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని అన్నారు. ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తించినవారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎల్లాల గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికపై మైనర్ బాలురు అత్యాచారం చేశారు. 14 నుంచి 16 ఏళ్లలోపు వయసున్న ముగ్గురు.. ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి ఇంట్లో చెబుతుందన్న భయంతో హత్య చేసినట్లు తెలుస్తుంది. బాలిక ఆచూకీ కోసం పోలీసులు చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Also read :Suicide: అప్పుల బాధతో గృహిణి ఆత్మహత్య
Vijaysai Reddy: మదన్ నన్ను రెండుసార్లు కలిశాడు.. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు: విజయసాయిరెడ్డి
భర్త కోసం వెయిట్ చేస్తోంది.. వచ్చేలోపే అంతా జరిగిపోయింది