June 29, 2024
SGSTV NEWS
CrimeNational

డ్యామ్ లో తగ్గిన నీరు.. బయటపడ్డ అస్థి పంజరాలు!

తరచూ అనేక ఘోరమైన ఘటనల గురించి మనం వార్తల్లో చూస్తుంటాము. తాజాగా ఓ ప్రాంతంలోని డ్యామ్ లో అస్థి పంజరాలు బయటపడ్డాయి. డ్యామ్ లోని నీరు తగ్గడంతో ఓ కారు బయటపడింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారింది.

మనకు నిత్యం అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. కొన్ని ఘటనలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. అలానే తాజాగా ఓ ప్రాంతంలోని డ్యామ్ లో అస్థి పంజరాలు బయటపడ్డాయి. డ్యామ్ లోని నీరు తగ్గడంతో ఓ కారు బయటపడింది. అందులో చూడగా మానవ అస్థి పంజరాలు కనిపించాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘఠన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇక ఆ అస్థి పంజరాలు ఓ యువకుడిది,ఓ వివాహితదిగా పోలీసులు గుర్తించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మొరెనా జిల్లాలో కువారి నదిపై గోపి గ్రామ సమీపంలో స్టాప్ డ్యామ్ ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా చుట్టుపక్కలా అనేక గ్రామాలకు తాగు, సాగునీరు అందుతుంది. అయితే ఇటీవల ఎండలు బాగా విజృంభించడంతో ప్రాజెక్ట్ లో నీరు తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో డ్యామ్ పక్క నుంచి వెళ్తున్న స్థానికులకు ఓ దృశ్యం కనిపించింది. డ్యామ్ లో ఒక కారు తేలియాడు కనిపించింది. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సిహానియా పోలీసుల ఘటన స్థలానికి చేరుకుని కారును బయటకు తీశారు. కారులో అస్థి పంజరాలను ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇక వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు..అవి ఎవరా అనే గుర్తించే పనిలో పడ్డారు. అస్థి పంజారుల దొరికిన ప్రాంత సమీపంలో ఉన్న గ్రామంలోని ప్రజలను పోలీసులు ఆరా తీశారు. ఈ క్రమంలోనే డ్యామ్ లో దొరికిన అస్థిపంజరాల్లో ఒకటి గురుద్వారా మొహల్లా అంబాహ్‌కు చెందిన ఛత్కా పురా ప్రాంత వాసి జగదీష్ జాతవ్ కుమారుడు నీరజ్ (26) అని గుర్తించారు. అలానే మరొకటి ఛట్కా పురా ప్రాంతంలో నివాసం ఉండే ముఖేష్ జాతవ్ భార్య మిథిలేష్ (32)గా పోలీసులు గుర్తించారు. నీరజ్ జాతవ్, మిథిలేషి భర్త ముఖేష్ జాతవ్ దగ్గర బంధువులు. అదే విధంగా ఆ మృతురాలి భర్త అంబాలో ప్రభుత్వ టీచర్ గా పని చేస్తున్నాడు.

గురుద్వారా మొహల్లా అంబాలో భార్యతో కలిసి అద్దెకు నివాసం ఉండే వాడు. తన భార్య మిథిలేష్ కనిపించకుండా పోయినట్లు ఫిబ్రవరిలో అంబాహ్ పోలీస్ స్టేషన్‌లో ముఖేష్ జాతవ్ ఫిర్యాదు చేశాడు. సరిగ్గా అదే సమయంలో నీరజ్ జాతవ్ అనే యువకుడు కూడా కనిపించకుండా పోయాడు. ఇక ఆ అబ్బాయి కుటుంబ సభ్యులు మాత్రం పోలీస్ స్టేషన్ లో ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. దీంతో పోలీసుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పరువు హత్యా లేక ప్రమాదవశాత్తు కారు నదిలో పడిందా అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Also read :పిన్నిని అసభ్య తాకిన అక్క కుమారుడు.. అతడు చేసిన పనికి

AP news: జగన్ కు ఓటెయ్యాలని బెదిరించారు.. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఎన్నికల ముందు అరాచకం

హైదరాబాద్ : మియాపూర్‌ బాలిక హత్యకేసులో ఊహించని ట్విస్ట్‌! తండ్రే నిందితుడు!

జిమ్ ట్రైనర్ తో ప్రేమ.. భర్త అడ్డుగా ఉన్నాడని.. మూడేళ్ల తర్వాత!

Related posts

Share via