SGSTV NEWS
Spiritual

Krishna Manthra:  ఎక్కడ కి అయినా ప్రయాణించేముందు ఈ మంత్రాన్ని చదవండి, ప్రమాదం జరగకుండా కాపాడుతుంది



రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలలో ఎక్కడికి ప్రయాణించినా కూడా ఎప్పుడు ఎలాంటి యాక్సిడెంట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గుర్తుతెచ్చుకుంటే ఈ విషయం నిజమే అనిపిస్తుంది. కేవలం టేకాఫ్ అయిన 10 సెకన్లలోనే పరిస్థితుల తారుమారైపోయాయి. 300 మంది దాకా మరణించారు. పనిమీద బయటికి వెళ్ళిన వ్యక్తి ప్రమాదం బారిన పడకుండా వస్తారో రారో అన్న గుబులు కుటుంబసభ్యుల్లో పెరిగిపోతుంది.

బయటికి వెళ్లేటప్పుడు దేవుడికి దండం పెట్టుకుని వెళ్లేవారు ఎంతోమంది. సుదీర్ఘ ప్రయాణానికి బయలుదేరేముందు మీరు సురక్షితంగా ఇంటికి రావాలని ప్రార్థిస్తారు. ఎందుకంటే ప్రమాదాల గురించి మనసులో ఏదో తెలియని భయం నెలకొని ఉంటుంది. అలాంటి అవాంఛిత సంఘటనల బారిన మిమ్మల్ని పడకుండా కాపాడే అద్భుతమైన మంత్రం ఒకటి ఉంది. దీన్ని మీరు ప్రయాణానికి ముందు జపిస్తే ఎంతో మంచిది.

దేవుడే సూపర్ పవర్

మనలో ఎంతోమంది దేవుడిని నమ్ముతారు. ఆ దేవుడే ప్రపంచాన్ని నడిపేది ఒక సూపర్ పవర్ అని చెబుతారు. ప్రతి ఒక్కరూ దేవుడిని తమ సొంత శరీరంలో ప్రార్థిస్తూనే ఉంటారు. హిందూమత గ్రంథాల ప్రకారం సురక్షితమైన ప్రయాణం కోసం ఒక శక్తివంతమైన మంత్రం ఉంది.

దేవుడే సూపర్ పవర్

మనలో ఎంతోమంది దేవుడిని నమ్ముతారు. ఆ దేవుడే ప్రపంచాన్ని నడిపేది ఒక సూపర్ పవర్ అని చెబుతారు. ప్రతి ఒక్కరూ దేవుడిని తమ సొంత శరీరంలో ప్రార్థిస్తూనే ఉంటారు. హిందూమత గ్రంథాల ప్రకారం సురక్షితమైన ప్రయాణం కోసం ఒక శక్తివంతమైన మంత్రం ఉంది. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తే ఆ వ్యక్తి ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా ఇంటికి వస్తాడని నమ్ముతారు. ఈ మంత్రం ఆ వ్యక్తికి ఒక రక్షణ కవచంలా మారుతుందని చెబుతారు.

ఈ శ్లోకం ప్రతిరోజూ చదవండి

ఇది చాలా పురాతనమైన శ్లోకం లేదా మంత్రం మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. ప్రమాదాల బారిన పడకుండా మిమ్మల్ని కాపాడుతుంది. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు జపిస్తే జీవితంలోని దుఃఖాలు పోయి సుఖాలు కలుగుతాయి. అంతేకాదు మీ ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ఈ మంత్రం శ్రీకృష్ణుడికి సంబంధించినది.

కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః



ఈ మంత్రానికి అర్థం ఎంతో స్వచ్ఛమైనది. ‘వాసుదేవుని కుమారుడా, పరమాత్మా…. నేను నీకు మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను. అన్ని కష్టాలను నాశనం చేయు’ అని శ్రీకృష్ణుని రూపాలను కొనియాడడమే ఈ మంత్రం అర్థం. ఆయనను స్మరించడం ద్వారా కష్టాలు, భయం ప్రమాదాలను తొలగించుకోవచ్చు.

ప్రతి మంత్రానికి ఒక సొంత శక్తి ఉంటుంది. అయితే ఆ మంత్రాలను మీరు చూపిస్తున్నప్పుడు ఉత్పన్నమయ్యే ఆధ్యాత్మిక శక్తి కూడా మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది. ప్రమాదాల నుండి కాపాడుతుంది. ఈ మంత్రం మీకు రక్షణ కవచంలా మారుతుంది.

Related posts

Share this