February 3, 2025
SGSTV NEWS
CrimeNational

రసగుల్లా.. మైసూరు పాక్..మాయలాడి శ్వేతాగౌడ మొబైల్లో నేతల పేర్లు ఇవి

బనశంకరి: కోట్లాది రూపాయల నగల వంచన కేసులో కమర్షియల్ స్ట్రీట్ పోలీసులకు పట్టుబడిన శ్వేతా గౌడ వలలో కొందరు నేతలు చిక్కుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ ఆమె మొబైల్ నంబరును గులాబ్ జామూన్ అని సేవ్ చేసుకున్నట్లు విచారణలో బయటపడడం తెలిసిందే. వర్తూరు నంబరును శ్వేత రసగుల్లా అని సేవ్ చేసుకుంది, మరో నాయకుని నంబర్ని ఆమె మైసూరు పాక్ అని సేవ్ చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు ఆమె ఫోను సీజ్ చేసి తనిఖీ చేశారు. దీంతో ఈ వ్యవహారం హనీ ట్రాప్ కావచ్చని అనుమానాలు ముసురుకున్నాయి. కోలారుకు చెందిన నేత నంబరు కూడా దొరికినట్లు సమాచారం.

ధార్ జీపు కానుక

కోలారులో ప్రముఖ నేతను కొన్నిరోజుల క్రితం శ్వేతాగౌడ ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకుంది. ఈమె మాయలో పడిన ఆ నేత ఆమెకు ఖరీదైన ధార్ జీప్ను కానుకకు రాసిచ్చాడు. ఆమెను కలిసేందుకు అతను కోలారు వెంకటేశ్వర స్వీట్ స్టాల్ నుంచి మైసూరు పాక్ను తీసుకువచ్చారు. దీంతో అతని మొబైల్లో అతని నంబరును మైసూరు పాక్ అని సేవ్ చేసుకుంది. పోలీసులు ఆమెను అరెస్టు చేసినప్పుడు ఆ జీప్ లోనే ఉంది. ఒకవేళ పోలీసులు ఆమెను అరెస్ట్ చేయకపోతే ఎంతోమంది హనీ ట్రాప్లో చిక్కేవారని అంచనా.

Also Read

Related posts

Share via