మెదక్ జిల్లాలో ఘోరం జరిగింది. షమ్నాపూర్‌కు చెందిన లత ప్రియుడి మోజులో తన భర్త శ్రీనును అత్యంత దారుణంగా చంపించింది. రూ.50 వేల సుపారీ తీసుకున్న మోహన్ మద్యం తాగించి శ్రీనును బీరుసీసాతో కొట్టి చంపాడు. లత, ప్రియుడు రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
TG Crime: తెలంగాణలో మరో దారుణం జరిగింది. ప్రియుడికోసం భర్తను దారుణంగా హతమార్చింది ఓ భార్య. మద్యం తాగించి ప్రియుడు, మరో స్నేహితులతో కలిసి అత్యంత కృరంగా బీరు సీసాలతో కొట్టి చంపించింది. ఆ తర్వాత తనకేమీ తెలియనట్లు మిస్సింగ్ కేసు పెట్టింది. కానీ పోలీసుల విచారణలో అసలు నిజం భయటపడగా మెదక్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి
పంచాయితీ పెట్టిన మారని బుద్ది..
హవేలీ ఘనపూర్ మండలం షమ్నాపూర్ గ్రామానికి చెందిన శ్రీను, లత దంపతులు కొంతకాలం బాగానే ఉన్నారు. అయితే ఇటీవల అదే గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తితో లత వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం గుర్తించిన శ్రీను.. చాలా సార్లు హెచ్చరించాడు. అయినా ఆమె మారకపోవడంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టించగా నచ్చజెప్పారు. అయినా పద్ధతి మార్చుకోని లత..ప్రియుడితో కలిసి తన భర్త అడ్డును తొలిగించాలని భావించింది.
ఈ క్రమంలోనే భర్తను హతమార్చేందుకు అదే గ్రామానికి చెందిన మలిశెట్టి మోహన్ అనే వ్యక్తికి రూ.50 వేలు ఇచ్చింది. మే 16న మద్యం సేవించేందుకు శ్రీనుని అనంతసాగర్ గ్రామ శివారులోకి తీసుకెళ్లిన మోహన్.. మత్తులో ఉండగానే బీరు సీసాతో తలపై కొట్టి హతమార్చాడు. మే 28న భర్త కనిపించడం లేదంటూ లత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ చేస్తుండగా అనుమానంతో లతను గట్టిగా నిలదీశారు. దీంతో తామే హత్య చేశామని లత, ఆమె ప్రియుడు రమేష్ అంగీకరించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
Also read
- నేటి జాతకములు..3 డిసెంబర్, 2025
- Sabarimala: శబరిమల 18 మెట్ల వెనకున్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసా?.. ఒక్కో మెట్టుకు ఒక్కో ప్రాధాన్యత
- Tirupati Crime News: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
- Apstc కర్చీఫ్ వేసిన సీటులోకూర్చుంటావా? పురుషుడిని జుట్టుపట్టుకుని చితక్కొట్టిన మహిళలు
- Acid attack: దారుణం.. నర్సింగ్
విద్యార్థినిపై యాసిడ్ దాడి..





