ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న వివాహితపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్. లింగోటంలో ఆదివారం రాత్రి జరిగింది
బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన
చౌటుప్పల్ : ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న వివాహితపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్కు చెందిన భార్యాభర్తలు ఐదారు నెలల క్రితం ఇక్కడికి వలస వచ్చారు. ఇద్దరూ వేర్వేరు పరిశ్రమల్లో దినసరి కూలీలుగా పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి వివాహిత (20) తన నివాసం వద్ద ఒంటరిగా ఉండటాన్ని అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు (22) గమనించాడు. అదే అదనుగా ఆమెను బలవంతంగా చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు 100 నంబరుకు ఫోన్ చేసి విషయం చెప్పగా వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొన్నారు. నిందితుడి గురించి ఆమెను ప్రశ్నించగా.. నేరుగా అతని ఇంటికి తీసుకెళ్లి చూపించారు. ఆ సమయంలో యువకుడు ఇంట్లోనే ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా నిందితుడు కొంత కాలంగా గంజాయికి బానిసైనట్లు తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలోనూ గంజాయి మత్తులోనే ఉన్నాడని సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు.
Also read
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..
- పిల్లలను కారులో ఉంచి లాక్ చేయడంతో…కొంచమైతే ఎంతఘోరం జరిగేది?
- పోలీసోళ్లను పిచ్చోళ్లను చేసింది.. MMTSలో అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్ !
- తిరుపతి అక్టోపస్ పోలీస్ కానిస్టేబుల్ దారుణ హత్య..మర్డర్ వెనుక సంచలన విషయాలు