సిక్కింలో గ్యాల్‌షింగ్ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. ఓ మైనర్ బాలికపై ఏకంగా ఏడాదిగా అత్యాచారం జరిగింది. చివరికి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఫిర్యాదు మేరకు నలుగురు బాలురతో సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
సిక్కింలో గ్యాల్‌షింగ్ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. ఓ మైనర్ బాలికపై ఏకంగా ఏడాదిగా అత్యాచారం జరిగింది. చివరికి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఫిర్యాదు మేరకు నలుగురు బాలురతో సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకి అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. జిల్లాలోని 13 ఏళ్ల బాలికను ఓ మహిళ పనుల్లో సాయం చేసేందుకు ప్రతిరోజూ తన ఇంటికి తీసుకెళ్లేది. ఆ తర్వాత బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి దింపింది.
మహిళ భర్త, మరో ఇద్దరు వ్యక్తులతో పాటు నలుగురు బాలురు ఏడాది కాలంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఆ బాలిక ఎప్పుడు చూసిన అనారోగ్యంగా ఉండేది. దీంతో ఓసారి టీచర్ ఆమెను గమనించింది. అంతేకాదు ఆ బాలిక ఎవరితో కూడా క్లాస్ మాట్లాడకుండా మౌనంగా కనపించేది. దీంతో ఏం జరిగిందని టీచర్ ఆ బాలికను అడిగింది. చివరికి ఆ బాలిక తనకు జరిగిన విషయాన్ని చెప్పింది. ఏడాదిగా తనపై లైంగిక దాడులు జరుగుతున్నాయని తెలిపింది.
దీంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఆ పాఠశాల సమాచారం అందించింది. ఆ సంస్థ ఏప్రిల్ 11న పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. మహిళ, ఆమె భర్త, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నలుగురు మైనర్ బాలురను అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బాధిత బాలికకు చికిత్స అందించడంతో పాటు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. పురుగుల మందు తాగి అక్క చెల్లెలు …
- Marriages : ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!
- ఇంగ్లీష్ టీచర్ వేధిస్తోంది.. మండుటెండలో కేజీబీవీ విద్యార్థినుల ధర్నా
- తాగుబోతు దాష్టీకం.. తాగి గొడవ చేస్తున్నాడని చెప్పినందుకు మహిళపై దారుణం..
- Kuja Dosha Remedies: జాతకంలో కుజ దోషమా.. లక్షణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నివారణలు ఏమిటంటే