తాజాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తనతో సహజీవనం చేసిన శవాన్ని గోనె సంచిలో కట్టి రోడ్డుపై పడేశాడు ఓ వ్యక్తి. ఆయన అలా ఎందుకు చేశాడో తెలిసేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు
భార్యాభర్తల బంధం ఎంతో గొప్పంది. అందుకే ఎన్ని కష్టాలు వచ్చిన జీవితం చివరి వరకు కలిసి బతుకుతారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆర్థిక కష్టాల కారణంగా మనస్సు చంపుకుని దారుణ నిర్ణయాలు తీసుకుంటారు. అలానే సహజీవనం చేసే కొందరి విషయంలోనూ అలానే జరుగతుంది. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తనతో సహజీవనం చేసిన శవాన్ని గోనె సంచిలో కట్టి రోడ్డుపై పడేశాడు ఓ వ్యక్తి. ఆయన అలా ఎందుకు చేశాడో తెలిసేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పట్టమంలో చందన్ నగర్ ప్రాంతంలో పాడుబడిన గోనె సంచిలో 57 ఏళ్ల ఆశా నర్గవే అనే మహిళ మృతదేహం కనిపించింది. స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇక మహిళ మృతదేహాన్ని పరిశీలించగా ఆమెపై ఎలాంటి గాయం కనిపించలేదని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టంకి తరలించగా కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె చాలాకాలంగా కాలేయ సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, వాటి కారణంతోనే ఆమె మరణించినట్లు పోస్టుమార్టంతో తేలింది. పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు తెలిశాయి.
ఆ మహిళ గత పదేళ్లుగా ఓ వ్యక్తితో సహజీవనంలో ఉన్నట్లు తేలింది. రాజ్‌మొహల్లా ప్రాంతంలోని తోట ప్రాంతంలో ఆమె భర్త 53 ఏళ్ల మదన్ నర్గావే అనే వ్యక్తి కనిపించాడు. సదరు వ్యక్తి ఆ మహిళ మృతదేహాన్ని మూడు రోజులుగా ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఈ క్రమంలోనే అతడి ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని చెప్పడంతో శనివారం రాత్రి ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో వేసి.. ఇంటికి దూరంగా రోడ్డుపైనే వదిలేసి. అంత్యక్రియలకు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో తాను ఈ పని చేసినట్లుగా మదన్ నర్గావే విచారణలో వెల్లడించాడు. ఇలా ఆర్ధిక సమస్యల కారణంగా ఎందరో నరకం చూస్తున్నారు. మరి.. ఈ విషాదకర ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!