February 23, 2025
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: గదిలోకి పిలిచి, ప్యాంట్ జిప్ తీసి.. పిల్లలతో ప్రిన్సిపల్ వికృత చేష్టలు!


తెలంగాణలో మరో కీచక టీచర్ నిర్వాకం బయటపడింది. బోడుప్పల్‌ శ్రీ బ్రిలియంట్ టెక్నో హైస్కూల్‌ ప్రిన్సిపల్ రవీందర్‌రావు తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ స్కూల్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. రవీందర్‌రావుపై ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. 

Hyderabad: తప్పుడు పనులు చేస్తున్న పిల్లలను సరైనా దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారుతున్నారు. చిన్న పిల్లలని చూడకుండా వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి పలు ఘటనలు దేశవ్యాప్తంగా కలంకలం రేపుతుండగా తెలంగాణలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యా్ర్థులతో మేడ్చల్ జిల్లా స్కూల్‌ ప్రిన్సిపల్‌ అసభ్యంగా ప్రవర్తించినట్లు బయటపడింది. పిల్లలను చిన్న చిన్న కారణాలతో తన రూమ్‌కు పిలిచి ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ శునకానందం పొందుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.

ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ..
ఈ మేరకు బోడుప్పల్‌లోని శ్రీ బ్రిలియంట్ టెక్నో హైస్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రిన్సిపల్ రవీందర్‌రావు లైంగిక వేధింపులకు గురి చేస్తూ వేధిస్తున్నాడంటూ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రూమ్‌కు పిలుచుకుని ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ దారుణంగా భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. విషయం తెలియగానే  వెంటనే అక్కడికి వెళ్లిన విద్యార్థి సంఘాలు దర్నాకు దిగాయి. దీంతో ప్రిన్సిపల్‌పై ఫోక్సో కేసు నమోదు చేసి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ గోవింద రెడ్డి తెలిపారు.

మరోవైపు తనపై విద్యార్థులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ప్రిన్సిపల్ రవిందర్ రావు చెబుతున్నాడు. 26 ఏళ్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవన్నాడు. పిల్లల తల్లిదండ్రులు కూడా ఏ రోజు కంప్లైట్ ఇవ్వలేదన్నాడు. అల్లరి చేస్తున్న పిల్లలను పద్ధతిగా ఉండాలని వారి బెల్ట్ పట్టుకుని లాగినందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

Also read

Related posts

Share via