ఏపీ రాజకీయాలపై ప్రశాంత్ కిశోర్ స్పందన
అభివృద్ధికి ఊతమిచ్చేందుకు జగన్ ఏమీ చేయలేదని వెల్లడి
ప్రజలకు నగదు బదిలీ చేశారే తప్ప ఉద్యోగాలు కల్పించలేదని వివరణ
జగన్ ఒక ప్రొవైడర్ గా ఉండిపోయారని వ్యాఖ్యలు
మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏపీ రాజకీయాలపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జగన్ మళ్లీ అధికారంలోకి రావడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి ఊతమిచ్చే ఒక్క పని కూడా జగన్ చేపట్టలేకపోయారని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. జగన్ ఒక ప్రొవైడర్ గానే ఉండిపోయారని, చక్రవర్తుల మాదిరిగా తాయిలాలతోనే జగన్ సరిపెట్టారని ప్రశాంత్ కిశోర్ వివరించారు. ప్రజలకు నగదు బదిలీ చేశారే తప్ప, ఉద్యోగాలు కల్పించలేదని అన్నారు. ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ భఘేల్ తరహాలోనే జగన్ కూడా పరిపాలన సాగించారని తెలిపారు.
Also read
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే
- వీడెక్కడి మొగుడండీ బాబూ.. నిద్రపోతుంటే భార్య మెడలో తాళి ఎత్తుకెళ్లాడు..!
- తెలంగాణ: కూతురు కోసం ఆ మాజీ పోలీస్ అధికారి ఏం చేశాడంటే…?
- పల్నాడు: పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలు.. పల్నాడులో చిత్ర విచిత్రాలు