SGSTV NEWS
Andhra Pradesh

పోలీస్ స్టేషన్ వద్ద పోసాని కృష్ణమురళికి తప్పిన ప్రమాదం



సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్ కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే పీఎస్ వద్ద ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. పీఎస్ వద్ద వాహనం దిగి లోపలకు వెళుతుండగా అకస్మాత్తుగా డ్రైవర్ వాహనాన్ని ముందుకు కదిలించాడు. దీంతో, వాహనం తగిలి పోసాని కిందకు పడపోబోయారు. అయితే పక్కనే ఉన్న పోలీసులు పట్టుకోవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. పోసాని సహా పోలీసు అధికారులు డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన పోలీస్ స్టేషన్ లోకి వెళ్లిపోయారు. పీఎస్ లో పోసాని విచారణ ఇంకా కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను దూషించారంటూ జనసేన నేత మణి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు… పోసానిని అరెస్ట్ చేశారు.

Also read



Related posts