చాక్లెట్లు ఇస్తూ మాయమాటలు చెప్పి అత్యాచారం ఐ.పోలవరం మండలంలో ఘటన పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు
ఐ.పోలవరం, : అభం శుభం తెలియని బాలికకు చాక్లెట్లు ఇస్తూ.. మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డ ఉదంతమిది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు కుమార్తె(11), కుమారుడు(9) ఉన్నారు. రెండేళ్లక్రితం భర్త చనిపోవడంతో అదే గ్రామంలోని పుట్టింటి వద్ద ఉంటూ పిల్లలిద్దరినీ ఆమె పోషిస్తున్నారు. బాలిక ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన వరుసకు బంధువయ్యే రాయపురెడ్డి వెంకటసత్యకృష్ణ (బాబీ) (52) ఇటీవల బాలిక ఇంటి ముందుకు వచ్చి చాక్లెట్లు ఇచ్చి వెళ్లడాన్ని గమనించిన తల్లి కుమార్తెను ప్రశ్నించింది. తనకు, స్నేహితురాలికి బాబీ అప్పుడప్పుడు చాక్లెట్లు ఇస్తుంటాడని.. పలుమార్లు అతని ఇంటికి, అతని సోదరుడి ఇంటికీ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని.. విషయం బయటకు చెబితే చంపుతానని బెదిరించాడని వివరించింది. దీంతో తల్లి గురువారం పోలీసులను ఆశ్రయించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం టి.కొత్తపల్లి సీహెచ్సీకి తరలించారు. నిందితుడిపై పోక్సో సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఐ.పోలవరం ఎస్సై రవీంద్రకుమార్ తెలిపారు. శుక్రవారం అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, ముమ్మిడివరం సీఐ మోహన్ క్కుమార్ బాధితురాలి ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. బాబీ మాయమాటలు చెప్పి బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని.. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నిందితుడు
ఐ.పోలవరం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యాకమిటీ ఎక్స్ అఫీషియో సభ్యుడు. విద్యార్థులకు క్రీడలపై అప్పుడప్పుడు పాఠశాలకు వెళి తర్పీదు ఇసుంటాడు. గతంలోనూ ఇతను పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
మహిళా కమిషన్ సీరియస్
ఈ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషన్ ఛైర్పర్సన్ డా. రాయపాటి శైలజ స్పందించారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించారు. నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. 48 గంటల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలన్నారు. బాధితురాలికి తక్షణ రక్షణ, వైద్య సహాయం, చట్టపరమైన మద్దతు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయానికి ఆదేశాలు జారీచేశారు.
Also read
- Weekly Horoscope: వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.. 12 రాశుల వారికి వారఫలాలు
- వికారాబాద్లో దారుణం.. వదిన, భార్య, పిల్లలను కొడవలితో నరికి చంపి, ఆపై భర్త సూసైడ్!
- ఎనిమిదో తరగతి బాలికపై లైంగిక దాడి
- ఆర్థిక ఇబ్బందులతో ఎస్సై బలవన్మరణం
- కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్





