July 5, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

పోలీసు విధుల్లో అక్రమంగా తరలిస్తున్న నిధులు పట్టివేత..

ఒంగోలు సౌత్ బైపాస్ దగ్గర ఎలాంటి రసీదులు లేకుండా కారులో తరలిస్తున్న 24 లక్షల 87 వేల 500 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు తాలూకా లిమిట్స్‎లో రాత్రి 8.00 గంటలకు సౌత్ బైపాస్ జంక్షన్ వద్ద వెహికల్ చెక్ చేయిస్తుండగా వైట్ కలర్ నెక్సన్ కారు (CG04NQ 3904) లో ఇద్దరు వ్యక్తులు బ్యాగులో డబ్బులు పెట్టుకొని ఒంగోలు టౌన్‎లో నుండి సౌత్ బైపాస్ జంక్షన్ మీద కందుకూరు వెళుతుండగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీం, ఒంగోలు తాలూకా సిఐ భక్తవత్సల రెడ్డి కారును ఆపి చెక్ చేయగా వారి వద్ద రూ. 24,87,500 నగదు ఉన్నట్టు గుర్తించారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను విచారించగా.. తాము రంగా పార్టికల్ బోర్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, కందుకూరు టౌన్‎లో డ్రైవరు, క్లర్క్‎గా పని చేస్తుంటామని పోలీసులకు తెలిపారు.

ఆ కంపెనీలో పని చేస్తున్న వర్కర్స్ ఒరిస్సా, మహారాష్ట్ర, రాజస్థాన్‎ల సంబంధించిన వారు కావడంతో హోలీ పండుగ సందర్భంగా అందరూ ఊర్లకు వెళ్తారని, తిరిగి వచ్చిన వర్కర్స్‎కు జీతాలు ఇచ్చేందుకు ఒంగోలు నుంచి కందుకూరుకు నగదు తరలిస్తున్నామని కారులో ఉన్న వ్యక్తులు తెలిపారు. ఒంగోలు బి కే అపార్ట్మెంట్ D బ్లాక్ ఫ్లాట్ నెంబర్ 306 కంపెనీ గెస్ట్ హౌస్ నుండి డబ్బులు తీసుకు వస్తున్నామని చెప్పారు. అయితే ఈ డబ్బుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేని కారణంగా ఒంగోలు రూరల్ ఎమ్మార్వో సృజన్ కుమార్, ఫ్లయింగ్ స్క్వాడ్ఇన్చార్జి ప్రసన్నకుమార్, తాలుకా సిఐ భక్తవత్సల రెడ్డి ఆ డబ్బును సీజ్ చేశారు. పట్టుబడిన డబ్బుకు సంబంధించి సరైన పత్రాలు, ఆధారాలు చూపించి నగదును తీసుకెళ్లవచ్చని.. లేని పక్షంలో ప్రభుత్వ ఖజానాకు డబ్బును జమ చేస్తామని అధికారులు తెలిపారు.
Also read

Related posts

Share via