పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో దారుణ హత్య జరిగింది.పట్టపగలే.. అదీ అంతా చూస్తుండగానే పెద్దపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని కిరాతకంగా పొడిచి చంపడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
Peddapalli Murder: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో(Agricultural Market) దారుణ హత్య జరిగింది.పట్టపగలే.. అదీ అంతా చూస్తుండగానే పెద్దపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని కిరాతకంగా పొడిచి చంపడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సోమవారం వ్యవసాయ మార్కెట్‌లో చోటు చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
కత్తితో మెడపై పొడిచి..
పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన పొలం కుమార్ ను, ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్ కత్తితో మెడపై పొడిచి దారుణంగా హత్య చేశాడు.ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. అయితే.ఆ మహిళ సంతోష్ భార్యగా నిర్ధారణ అయ్యింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని.. అందుకే భార్య కళ్ల ముందే ప్రియుడ్ని హతమార్చి ఉంటాడని భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడితో పాటు ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.హత్య అనంతరం సంతోష్ అక్కడే ఉండటం గమనార్హం. హత్యను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి నిందితుడు సంతోష్‌ను పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. అయితే కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. హత్యకు గల పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంది.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!