April 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

పాస్టర్ ప్రవీణ్ కేసులో పోలీసుల బిగ్ ట్విస్ట్.. ఒకరు అరెస్ట్!


పాస్టర్ ప్రవీణ్ కేసులో తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిని రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఇది హత్యే అని వాదిస్తున్న వారికి నోటీసులు ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రూఫ్స్ ఇవ్వాలని కోరుతున్నారు.

పాస్టర్ ప్రవీణ్ కేసు విచారణ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ప్రమాదం అంటూ పోలీసు వర్గాలు.. కాదు పక్కా ప్లానింగ్ మర్డర్ అంటూ క్రైస్తవ సంఘాలు వాదిస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు చాలా పకడ్బందీగా విచారణ చేస్తున్నారు. హైదరాబాద్ లో పాస్టర్ బయలుదేరినప్పటి నుంచి.. ప్రమాదం జరిగిన ప్రదేశం వరకు దారి పొడుగునా అనేక సీసీ ఫుటేజీలను సేకరించారు. ఇందుకు సంబంధించి రోజుకో కొత్త వీడియో బయటకు వస్తోంది. ఈ క్రమంలో ప్రవీణ్ మృతిపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

మాజీ ఎంపీ హర్షకుమార్ కు నోటీసులు..
రాజమండ్రి లలితా నగర్‌కు చెందిన నాగమల్లేష్‌ ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో న్యాయస్థానం ఆ వ్యక్తికి రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు. పాస్టర్ ప్రవీణ్‌ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న వారికి పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ GV హర్ష కుమార్‌కు రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. ఆయన చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంటున్నారు.

అయితే.. హర్షకుమార్ పోలీసులకు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు. ఇప్పటికే పలువురు పాస్టర్లకు సైతం పోలీసులు నోటీసులు ఇచ్చి కీలక విషయాలు రాబట్టారు. ప్రవీణ్ మృతిపై తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్‌మీడియా ఖాతాలను సైతం గుర్తిస్తున్నారు పోలీసులు. వారందరికీ నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు.

Also read

Related posts

Share via