Parakamani Theft Case: పరకామణి డాలర్ల చోరీ కేసు కొత్త మలుపు తిరుగుతోందా? ఆనాటి ప్రభుత్వం వైసీపీ మాటలు ఒకలా? నిందితుడు రవికుమార్ మాటలు మరొకలా ఉన్నాయా? అసలు ఈ చోరీ కేసులో ఎలాంటి విషయాలు వెలుగులోకి రానున్నాయి? సీఐడీ అందజేసిన వివరాలపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? ఈ నేపథ్యంలో కీలక నిందితుడు రవికుమార్ విడుదల చేసిన వీడియో దుమారం రేపుతోంది.
పరకామణి చోరీ కేసులో ఏం జరుగుతోంది?
పరకామణి చోరీ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చోరీని చిన్న తప్పుగా వర్ణించారు మాజీ సీఎం జగన్. దీనిపై దుమారం రేగుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. స్వామి హుండీ డబ్బులు దొంగలిస్తే చిన్న తప్పా? ఈ విషయంలో నిందితులను జగన్ వెనుకేసుకు రావడంపై దుమారం తారాస్థాయికి చేరింది. పరిస్థితి గమనించిన నిందితుడు రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
రెండేళ్ల కిందట పరకామణిలో తాను చోరీ చేసినట్టు ఒప్పేసుకున్నాడు. తనను బ్లాక్ మెయిల్ చేశారంటూ నాలుగైదు నిమిషాల నిడివి గల వీడియో విడుదల చేశారు. భార్యాపిల్లలు తలుచుకుని బాధపడని రోజు లేదని, దయచేసి తమను చేసుకోవాలని కోరాడు. ఆ తప్పును మహాపాపంగా భావిస్తున్నట్లు వెల్లడించాడు.
నిందితుడు రవి కీలక వ్యాఖ్యలు, సీబీఐకి వెళ్లే ఛాన్స్?
అందుకు ప్రాయశ్చిత్తంగా 90 శాతం తన ఆస్తిని శ్రీవారికి రాసిచ్చినట్టు మనసులోని మాట బయటపెట్టారు. తనను కొంతమంది బ్లాక్ మెయిల్ చేశారని బయటపెట్టాడు. తాను, తన కుటుంబం తీవ్ర క్షోభ అనుభవిస్తున్నామని వెల్లడించాడు. కానీ, కొంతమంది తమపై పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించాడు.
ఇప్పటికైనా తమపై తప్పుడు ప్రచారం చేయొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఆదేశిస్తే ఎలాంటి వైద్య పరీక్షలకైనా సిద్ధమేనని చెప్పాడు. రవికుమార్ మాటలు గమనించినవాళ్లు మాత్రం కొందరు నేతల ఒత్తిడి వల్ల ఆ వీడియో రిలీజ్ చేశాడని అంటున్నారు. ఏడాదిగా అజ్ఞాతంలో ఉన్న ఆయన, ఇప్పుడు వీడియో రిలీజ్ చేయడంపై ఏదో కారణం ఉండే ఉంటుందని అంటున్నారు.
ఇన్నాళ్లు దీనిపై రవికుమార్ ఎందుకు నోరెత్తలేదు. సీఐడీ దర్యాప్తు చేసి, హైకోర్టుకి నివేదిక ఇచ్చిన తర్వాత ఆయన వీడియో రావడం వెనుక అసలు ఏం జరిగిందంటూ కొంతమంది ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ వ్యవహారంలో సీఐడీ ప్రాథమిక దర్యాప్తు చేసిందని అంటున్నారు. సీఐడీ నివేదికను పరిశీలించిన తర్వాత ఈ కేసుని సీబీఐకి అప్పగించినా ఆశ్యర్యపోనక్కర్లేదని అంటున్నారు. అదే జరిగితే మీడియా ముందు మాజీ మంత్రి జగన్ వ్యాఖ్యలు కీలకంగా మారుతాయని అంటున్నారు.
Also Read
- Venni Karumbeswarar Temple: షుగర్ పేషెంట్లు క్యూ కడుతోన్న శివాలయం.. ఈ ఆలయ రహస్యం ఇదే!
- 2026లో అదృష్ట రాశులు వీరే.. మీ రాశి ఉందో చూసేయండి!
నవ గ్రహాల్లో శని గ్రహానికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యతనే వేరు. - Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఈ సంకేతాలు కనిపిస్తే మరణం ఆసన్నం అయినట్లట
- Kubera Yoga: గురువు అతి వక్రం.. ఆ రాశుల వారికి కుబేర యోగం పట్టబోతోంది..!
- Nidhivan Mystery: రాత్రి పూట ఆ గుడివైపు వెళ్లిన వారు ఏమవుతున్నారు?.. రంగమహల్ మిస్టరీ ఇదీ!





