February 23, 2025
SGSTV NEWS
CrimeTelangana

పెయింటర్ కాదు పాపిష్టోడు.. భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం : సంగారెడ్డిలో దారుణం


సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది.  భర్త కళ్లముందే ఆమె భార్యపై అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. ఫసల్‌వాదిలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో యింటింగ్‌ పనులు చేస్తున్న తమిళనాడుకు చెందిన మాథవన్‌ అనే వ్యక్తి  వివాహితపై కన్నేసి భర్త కళ్లముందే అత్యాచారం చేశాడు.

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది.  భర్త కళ్లముందే ఆమె భార్యపై అత్యాచారం చేశాడో దుర్మార్గుడు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలంలోని ఓ తండాకు చెందిన దంపతులు సంత్‌ సేవాలాల్‌ జయంతి సందర్భంగా మొక్కులు చెల్లించడానికి 2025 ఫిబ్రవరి 02 వతేదీన తమ స్వగ్రామం నుంచి అనంతపురం జిల్లా నేరడిగొండకు కాలినడకన బయలుదేరారు.  అక్కడ మొక్కులు చెల్లించుకుని తిరిగి కాలినడకన ఇంటికి పయనమయ్యారు.

శుక్రవారం రోజు రాత్రికి సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాది గ్రామానికి చేరుకున్నారు. అక్కడే ఫసల్‌వాదిలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో రాత్రి భోజనం చేశారు. రాత్రి ప్రయాణం ఎందుకని పక్కనే ఉన్న ఓ చెట్టు కింద నిద్రపోయారు. అయితే అక్కడ నిర్మాణంలో ఉన్న విద్యాపీఠం ఆలయంలో పెయింటింగ్‌ పనులు చేస్తున్న తమిళనాడుకు చెందిన మాథవన్‌ (34) అనే వ్యక్తి  సదరు వివాహితపై కన్నేశాడు.

భర్తపై మాధవన్ దాడి
అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు. మహిళ కేకలు వేయడంతో వెంటనే నిద్రలేచిన ఆమె భర్తపై మాధవన్ దాడికి దిగాడు.  అడ్డుకోబోయిన అతన్ని రాయితో కొట్టి గాయపరిచాడు. అయితే అతని నుంచి తప్పించుకున్న  మహిళ భర్త వెంటనే 100కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న సంగారెడ్డి రూరల్‌ పోలీసులు నిందితుడు మాథవన్‌ను అదుపులోకి తీసుకున్నారు.  నిందితుడు నేరం అంగీకరించడంతో అతనిపై పోలీసులు పలు సెక్షన్ల కింద  కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. తీవ్రగాయాలైన మహిళ భర్తను ఆసుపత్రికి తరలించారు

Also read

Related posts

Share via