April 4, 2025
SGSTV NEWS
Andhra PradeshViral

Ananth Babu: వెలుగులోకి అనంతబాబు అసభ్య వీడియో!

వైకాపా నేతల రాసలీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రచ్చకెక్కింది.

మార్ఫింగ్ చేశారన్న ఎమ్మెల్సీ



పాడేరు, – అడ్డతీగల: వైకాపా నేతల రాసలీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రచ్చకెక్కింది. మరో ఎమ్మెల్సీ అనంతబాబు అసభ్యంగా ప్రవర్తిసున్నట్లున్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. తన దగ్గర పనిచేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో నిందితుడైన అనంతబాబు బెయిల్పై బయటికొచ్చారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఓ వీడియో కాల్లో ఎమ్మెల్సీ అనంతబాబు అవతలి వారితో మాట్లాడుతూ వారికి ముద్దులు పెట్టడంతోపాటు జుగుప్సాకరంగా ప్రవర్తించినట్లుగా ఉంది. ఈ విషయాన్ని అనంతబాబు వద్ద ప్రస్తావించగా అదంతా మార్ఫింగ్ వీడియో అని కొట్టిపారేశారు. వీడియోకాల్లో పిల్లలకు ముద్దులు పెట్టిన వాటిని కత్తిరించి, మార్ఫింగ్ చేసి కొన్ని నెలలుగా తనను ఒకరు బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నారు. తన వీడియోలను మార్ఫింగ్ చేసి, దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిపై విచారించి చర్యలు తీసుకోవాలని ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు.

Also read

Related posts

Share via