March 16, 2025
SGSTV NEWS
CrimeNational

మార్ఫింగ్ ఫోటోలతో బెదిరించి ఒకడు.. వీడియో తీసి మరోకడు..స్కూల్ విద్యార్థినిపై లైంగిక దాడి


స్కూల్లో మార్ఫింగ్ ఫోటోలతో విద్యార్థినిని ముగ్గురు విద్యార్థులు లైంగికంగా వేధించారు. ముందుగా గచ్చిబౌలిలోని ఓ స్కూల్లో ప్రేమ పేరుతో  ఓ బాలుడు బాలికను వేధించాడు. అయితే ఆ బాలిక అతని ప్రేమను నిరాకరించడంతో మార్ఫింగ్ ఫోటోలతో బాలికను వేధింపులకు గురిచేశాడు.

స్కూల్లో మార్ఫింగ్ ఫోటోలతో విద్యార్థినిని ముగ్గురు విద్యార్థులు లైంగికంగా వేధించారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. గచ్చిబౌలిలోని ఓ స్కూల్లో ప్రేమ పేరుతో  ఓ బాలుడు బాలికను వేధించాడు. అయితే ఆ బాలిక అతని ప్రేమను నిరాకరించడంతో మార్ఫింగ్ ఫోటోలతో బాలికను వేధింపులకు గురిచేశాడు. అంతేకాకుండా బ్లాక్ మెయిల్ చేసి బాలికపై లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడు. అయితే ఈ తతంగాన్నంతా వీడియో రికార్డ్ చేశాడు మరో బాలుడు. ఆ వీడియో చూపించి ఆ బాలికను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో  వీడియో షూట్ చేసిన ఫోన్ పగలగొట్టింది బాలిక. ఈ విషయంలో వారి ఇద్దరి మధ్య గొడవపడుతుండగా చూసి బాలికను మరో బాలుడు వేధించడం మొదలుపెట్టాడు. ఇలా కొన్ని రోజులుగా బాలికను ముగ్గురు మైనర్ బాలుర్లు వేధించడం మొదలుపెట్టారు. అయితే ఈ విషయాన్ని  ఆమె ఫ్రెండ్స్ బాలిక తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వెంటనే బాలిక తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు విద్యార్థులపై పలు సెక్షన్ల కింద ముగ్గురు మైనర్లపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం
ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. అందరికీ న్యాయం జరిగే కోర్టులోనే మహిళా ఉద్యోగికి లైంగిక వేధింపులు ఎదురైయ్యాయి. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ఉద్యోగి మహిళా ఉద్యోగిరాలిని లైంగికంగా వేధింస్తున్నాడు. సదరు మహిళతో కోర్టు బెంచ్‌ క్లర్క్ సత్యనారాయణ నీచపు పనులు ఒడిగట్టాడు. అసభ్యంగా తాకుతూ ఆమెను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ట్యూబెక్టమీ చేయించుకున్నావా.. ఎంజాయ్ చేద్దామా అంటూ వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు. నీకు ఏం కావాలన్నా అడుగు చేస్తా.. నాకు కావాల్సింది నాకు ఇచ్చేయ్ అంటూ వేధిస్తున్నాడని మహిళా ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు సహకరిస్తే ఉద్యోగం పర్మినెంట్ చేయిస్తానంటూ సత్యనారాయణ  ఆఫర్లు ఇచ్చాడు. క్లర్క్ సత్యనారాయణ వేధింపులు తాళలేక సదరు మహిళా ఉద్యోగి పోలీసులను ఆశ్రయించింది. ఆ మహిళా ఉద్యోగి సత్యనారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. BNS సెక్షన్ 74, 75, 78 కింద కేసు నమోదు చేశారు.

Also read

Related posts

Share via