February 3, 2025
SGSTV NEWS
EntertainmentTelangana

మందలించారని ఉరేసుకున్నారు

• బయటకు వెళ్లొద్దన్నందుకు ఒకరు… చదువుకోమని చెప్పడంతో మరొకరు..

• పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు బలవన్మరణం

రామగుండం గోదావరిఖని: అర్ధరాత్రి బయటకు వెళ్లొద్దని తండ్రి మందలించడంతో ఒకరు, పద్ధతి మార్చుకోవాలని తల్లి హెచ్చరించడంతో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. పెద్దపల్లి జిల్లాలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. గోదావరిఖని యైటింక్లయిన్కాలనీ సమీప పోతనకాలనీలో ఉంటూ, ఏఎల్పీ గనిలో ఎలక్ట్రిషియన్గా విధులు నిర్వహిస్తున్న సింగరేణి కార్మికుడు కొండిల్ల శ్రీనివాస్కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు సాయి అవినాష్ (20) డిప్లొమా చదువుతూ వార్షిక పరీక్షల్లో ఫెయిలయ్యాడు.

అతడి కోరిక మేరకు తండ్రి మంచిర్యాలలోని ప్రభుత్వ ఐటీఐలో చదివిస్తున్నాడు. ఈనెల 29న ఇంటికి వచ్చిన అవినాష్.. ఆదివారం రాత్రి బయటకు వెళ్తానని, బైక్ కావాలని తండ్రిని అడిగాడు, రాత్రి సమయంలో బయటకు వెళ్లద్దని, బైక్ ఇవ్వనని తండ్రి చెప్పడంతో కలత చెందిన అవినాష్.. తెల్లవారు జామున ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

మరో ఘటనలో తల్లిమందలించిందన్న మనస్థాపంతో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన ముక్క రోహక్(16) సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. రోహక్ మార్కండేయ కాలనీలో నివాసం ఉంటూ ఎస్టీపీసీలోని సన్దేవ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీకి సరిగ్గా వెళ్లడంలేదు. కనీసం ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా రాయలేదు. ఎప్పుడూ బయట తిరుగుతూ ఇంటికి వచ్చేవాడు కాదు. ఆదివారం కూడా బయటకు వెళ్లి ఇంటికి వచ్చాడు. ఇలా చేస్తే కెరీర్ పాడవుతుందని, పద్ధతి మార్చుకోవాలని తల్లి మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన రోహక్ పెంట్ హౌస్ ఇనుపరాడ్ కు ఉరివేసుకుని మృతి చెందాడు.

Also Read

Related posts

Share via