November 22, 2024
SGSTV NEWS
National

మరోసారి-పతంజలిస్-పబ్లిక్-క్షమాపణ

ఢిల్లీ : ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్‌ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ బుధవారం మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది.
తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెబుతూ వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని పతంజలి గ్రూప్‌ నిన్న సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసును నిన్న విచారించిన జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ ఎ.అమానుల్లా నేతత్వంలోని బెంచ్‌ క్షమాపణలను ప్రముఖంగా ప్రచురించారా? అని ప్రశ్నించింది. మునుపటి ప్రకటనల ఫాంట్‌, సైజు అదేనా? అని జస్టిస్‌ కోహ్లీ ప్రశ్నించారు. రాందేవ్‌, బాలకృష్ణ తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ క్షమాపణల ప్రకటనను 67 పత్రికల్లో రూ. 10 లక్షల ఖర్చుతో ప్రచురించినట్టు చెప్పారు. స్పందించిన జస్టిస్‌ కోహ్లీ.. ప్రకటనలను కత్తిరించి తమకు సమర్పించాలని కోరారు. అవి వాస్తవ పరిమాణంలోనే ఉండాలని, ఈ క్రమంలో వాటిని పెద్దగా చూపించే ప్రయత్నం చేయవద్దని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తూ ఆ రోజున రాందేవ్‌, బాలకృష్ణ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

Also read

Related posts

Share via