అనంతపురం జిల్లా సవేరా హాస్పిటల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నర్సుగా పనిచేస్తున్న దివ్యశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నైట్ డ్యూటీ చేసి హాస్టల్‌కు వెళ్లిన దివ్యశ్రీ కన్నుమూసింది. ఉదయం కుటుంబ సభ్యులతో మాట్లాడిన దివ్య మధ్యాహ్నాం మరణించింది.
అనంతపురం జిల్లా సవేరా హాస్పిటల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అందులో నర్సుగా పనిచేస్తున్న దివ్యశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నైట్ డ్యూటీ చేసి హాస్టల్‌కు వెళ్లిన దివ్యశ్రీ కన్నుమూసింది. ఉదయం కుటుంబ సభ్యులతో మాట్లాడిన దివ్యశ్రీ మధ్యాహ్నాం మరణించింది. దివ్యశ్రీ మరణంపై హాస్పిటల్ యాజమాన్యం మాత్రం ఎలాంటి సమాధానం చెప్పలేదు. తమ కూతురిని చంపేశారంటూ దివ్యశ్రీ ఆసుపత్రి ముందు ఆమె తల్లిదండ్రుల ఆందోళన చేపట్టారు.
న్యాయం చేయాలని డిమాండ్
కాళ్లు పట్టుకున్నా కూడా ఎవరూ సమాధానం చెప్పడం లేదని దివ్యశ్రీ తల్లి వాపోయారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తాము కూడా ఆత్మహత్యకు పాల్పడుతామని బాధతో తెలిపారు. ఐదేళ్లుగా సవేరా హాస్పిటల్‌లో నర్స్‌గా పనిచేస్తు్ంది దివ్యశ్రీ. గతంలో ఇదే హాస్పిటల్‌లో అనుమానాస్పదంగా ఓ నర్స్ మరణించింది. ఒకే ఆసుపత్రిలో నర్సులుగా పనిచేస్తున్న ఇద్దరు చనిపోవడం స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also read
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





