ఖైరతాబాద్: గదిలో హీటర్ పెట్టుకునే క్రమంలో విద్యుత్ షాకు గురై యువతి మృతిచెందిన సంఘటన ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ස0යි. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్కు చెందిన కె.సౌమ్య (20) ఖైరతాబాద్లో నివాసం ఉంటూ వాసవీ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది.
Also read :చంపిన వాడు ఉన్మాదే.. ప్రాధేయపడ్డా కాపాడని ఈ అమ్మాయిలని ఏమంటారు?
శుక్రవారం సాయంత్రం డ్యూటీకి వెళ్లాల్సి ఉండగా సౌమ్య స్నేహితుడు ప్రశాంత్ ఆమెకు ఫోన్చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానంతో రాత్రి 7.30గంటల ప్రాంతంలో గదికి వచ్చి తలుపు తట్టగా తీయలేదు. దీంతో స్థానికుల సాయంతో తలుపులు తెరిచి చూడగా గదిలో బాత్రూం పక్కనే సౌమ్య హీటర్ మీదపడి అచేతనంగా కన్పించింది. వెంటనే హీటర్ స్విచ్ ఆఫ్ చేసి ఆమెను హాస్పిటల్కు తరలించగా డ్యూటీ డాక్టర్ పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.
Also read :వ్యాపారస్తులకు బిగ్ అలర్ట్.. మార్కెట్ లో కొత్త తరహా మోసం!
గదిలో హీటర్ స్విచాన్ చేసి బకెట్లో వేసే క్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మృతిచెంది ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. శరీరంపై హీటర్ వల్ల కాలిన గాయాలు ఉన్నాయి. ఈ మేరకు మృతురాలి తల్లి భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also read :2 రోజులుగా కనిపించని యువతి! అర్ధరాత్రి ఫోన్! పోలీసులే షాకయ్యే క్రైమ్!